నా గుండె సంతోషంతో పొంగిపోతోంది: రేణు దేశాయ్

By Bojja Kumar

హైదరాబాద్: సోషల్ నెట్వర్కింగ్ ద్వారా ఎప్పుడూ అభిమానులతో టచ్‌లో ఉండే రేణు దేశాయ్.....తరచూ ఏదో ఒక పోస్టు చేస్తూ ఫ్యాన్స్‌‌ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా ఆమె తన కుమారుడు అకిరా పుట్ బాల్ ఆడుతున్న ఫోటో ఒకటి పోస్టు చేసింది. ‘నా బిడ్డ ఎదుగుదల చూస్తుంటే నా గుండె ఆనందంతో పొంగిపోతోంది' అంటూ కామెంట్ చేసింది.

అటు నిర్మాతగా, దర్శకురాలిగా కెరీర్ కొనసాగిస్తూ....ఇటు పిల్లల బాధ్యత పర్ ఫెక్టుగా నిర్వర్తిస్తోంది రేణు దేశాయ్. పిల్లలంటే ఆమెకు ఎంతో ప్రేమ. పవన్ కళ్యాణ్ నుండి విడిపోయిన తర్వాత పిల్లలే తన సర్వస్వంగా జీవిస్తోంది. వారిని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

ఇక రేణు దేశాయ్ తాజా సినిమా విషయానికొస్తే... ఆమె స్వీయ నిర్మాణ దర్శకత్వంలో ‘ఇష్క్ వాలా లవ్' చిత్రాన్ని తెరకెంచిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని తొలుత అక్టోబర్ 10 విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసిన రేణు దేశాయ్, ఆ తర్వాత అక్టోబర్ 17 కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఆ రోజు కూడా విడుదల సాధ్యంకాలేదు. తర్వాత అక్టోబర్ 24న అనుకున్నప్పటికీ వీలు పడలేదు.

My heart swells with joy seeing my little baby all grown up: Renu Desai

అయితే సినిమా వాయిదాల మీద వాయిదా పడుతుండటంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. అకీరా నటించిన తొలి సినిమా కావడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘ఇష్క్ వాలా లవ్' ఒక బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ స్టోరతో కూడిన డ్రామా. ఆదినాథ్ కొఠారి, సులగ్నా పానిగ్రాహి లీడ్ రోల్స్ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'ఖుషి' చిత్ర దర్శకుడు ఎస్.జె.సూర్య రెండు సాంగులను కంపోజ్ చేసాడు. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ తనయుడు అకీరా కూడా ఓ చిన్న పాత్రలో కనిపించనున్నాడు. తెలుగులో కలెక్షన్లు రాబట్టేలనే ముఖ్య ఉద్దేశ్యంతో అకీరాతో గెస్ట్ రోల్ చేయించినట్లు సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X