తన భర్త వల్లే అంటున్న యాంకర్ అనసూయ
హైదరాబాద్: ఇప్పటి వరకు బుల్లితెరపైనే తన టాలెంట్ తో అందరినీ ఆకట్టుకున్న యాంకర్ అనసూయ త్వరలో వెండితెరపైకి రాబోతున్న సంగతి తెలిసిందే. కొత్త దర్శకుడు రవికాంత్ పేరపు దర్శకత్వంలో ఆమె నటించబోతోంది. ఈ చిత్రానికి టైటిల్ ‘క్షణం' అనే టైటిల్ కూడా దాదాపుగా ఖరారైంది. ఈ చిత్రంలో ఆమె అడవి శేష్ కు జోడీగా నటించబోతోందట. 2015 మార్చిలో షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. తాను సినిమాల్లోకి రావడానికి తన భర్త పూర్తి సపోర్టు ఉందని చెబుతోంది అనసూయ. ఇలా అర్థంచేసుకుని సపోర్టు చేసే భర్త ఉండటం అనసూయ అదృష్టం అంటున్నారంతా.
ఫేస్‌బుక్ ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్స్
యాంకర్‌గా తక్కువ కాలంలో కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ అనసూయ. న్యూస్ రీడర్‌గా కెరీర్ ప్రారభించి....జబర్దస్త్ షోతో పాపులర్ అయి, ఆడియో ఫంక్షన్లకు యాంకరింగ్ చేస్తూ హాట్ ఇమేజ్ సొంతం చేసుకుంది. దీంతో ఆమెకు ఆ మధ్య అత్తారింటికి దారేది, రేసు గుర్రం లాంటి చిత్రాల్లో ఆఫర్లు కూడా వచ్చాయి.
అయితే అప్పట్లో ఆమె ఏ ఆఫర్ కూడా ఒప్పుకోలేదు. మా హీరో సినిమా తిరస్కరిస్తావా? అంటూ ఆ మధ్య పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ వాగ్వివాదానికి దిగితే వారితో సోషల్ మీడియాలో గొడవ కూడా పెట్టుకున్నారు. ఎట్టకేలకు ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుండటం హాట్ టాపిక్ అయింది.

‘క్షణం' చిత్రం థ్రిల్లర్ జేనర్లో తెరకెక్కబోయే చిత్రమని తెలుస్తోది. దర్శకుడు రవికాంత్ పేరెపు అనసూయ పాత్రను చాలా కీలకంగా చూపించబోతున్నాడట. సినిమాలో హీరోయిన్ ఆమెనే అంటున్నారు. తొలుత ఆమె ఈ పాత్ర ఒప్పుకోవడానికి సందేహించిందని, స్ర్కిప్టు విన్న తరువాత ఒప్పుకోకుండా ఉండలేక పోయిందని టాక్.
ఇన్నాళ్లు మనకు యాంకర్‌గా కనిపించిన అనసూయ వేరు....సినిమాలో మనం చూడబోయే అనసూయ వేరుగా ఉంటుంది, పూర్తి డిఫరెంటుగా ఆమె రోల్ ఉంటుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి. యాంకర్ గా సక్సెస్ అయిన అనసూయ సినిమాల్లో ఎలా రాణిస్తుందో చూడాలి.


Click it and Unblock the Notifications











