‘నా భర్తే నన్ను వ్యభిచారిగా మార్చాడు’ (వీడియో)
ముంబై: ఈ మధ్య కాలంలో వ్యబిచారం అంటే చాలు ముందుగా సినిమా రంగానికి చెందిన వారే గుర్తొస్తున్నారు. ఈ మధ్య కాలంలో పలువురు హీరోయిన్లు, నటీమణులు ఆర్థిక అవసరాల కోసమో, జల్సా జీవితానికి అలవాటు పడో.....ఈ చీకటి వృత్తిలోకి ప్రవేశిస్తున్న సంగతి తెలిసిందే.

అయితే ఓ మహిళ తన కుటుంబాన్ని పోషించుకోవడానికి తప్పనిసరి పరిస్థితుల్లో వ్యభిచార వృత్తిలోకి దిగిన వైనాన్ని తెరపై ఆవిష్కరిస్తూ దర్శకుడు పంకజ్ ఠాకూర్ రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ‘మై హస్బెండ్ మేడ్ మి ఎ ప్రాసిట్యూట్' అందరినీ ఆకర్షిస్తోంది. డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనే సందేశాత్మక కాన్సెప్టును జోడిస్తూ ఈ షార్ట్ ఫిల్ కాన్సెప్టును రచించారు రచయిత జోయ్‌బ్రాతో దత్తా.
మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదానికి గురై...కోమాలోకి వెళ్లిన భర్తను కాపాడుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి ఓ మహిళ వ్యభిచార కూపంలోకి వెళ్లిన వైనాన్ని ఇందులో చూపెట్టారు. ఆ షార్ట్ ఫిల్మ్‌పై మీరూ ఓ లుక్కేయండి.


Click it and Unblock the Notifications