ఉపాసనా తన లక్కీగార్ల్ గా ఫీలవుతున్న రామ్ చరణ్
ఇంతకు ముందు ఎవరికీ అంతగా తెలియని పోలో గేం, ఇప్పుడు రామ్ చరణ్ పుణ్యమా అని మన రాష్ట్రంలో చాలామందికి తెలుస్తోంది. తన కాబోయే భార్య ఉపాసన ప్రోత్సాహంతో ఈమధ్య చరణ్ ఈ పోలో ఆటను నేర్చుకోవడం, తాజాగా ఓ పోలో క్లబ్ ను కొనడంతో వీటికి సంబంధించిన వివరాలు మీడియాలో విస్తృతంగా వచ్చాయి. దాంతో మెగా అభిమానులకు ఈ ఆటపైన ఆసక్తి ఏర్పడింది. తన పేరు కలిసోచ్చేలా ఆ క్లబ్ కు ఆర్.సి.టి. అన్న పేరును పెట్టడం కూడా జరిగింది.
ఉపాసనా కామినేనితో రామ్ చరణ్ నిశ్చితార్థం నవంబర్ లో జరగనుంది. అప్పుడే ఉపాసనా తనకి కలిసొచ్చిందని అంటున్నాడు రామ్ చరణ్ తేజ్. నిన్న పోలో టీమ్ విజయం సాధించిన విషయం విధితమే. ఈ సందర్భంగా రామ్ చరణ్ తేజ్ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. తన 'లేడీ లక్" వల్లే ఈ టీమ్ విజయం సాధించిందని కూడా అన్నాడు. ఆ రకంగా ఉపాసనా తనకి కలిసొచ్చిందని చరణ్ పేర్కొన్నాడు. ఇంకా జీవితంలోకి రాకముందే ఉపాసనాని తన లక్కీ గర్ల్ గా ఫీలవుతున్నాడంటే...తనపై చరణ్ కి ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చు...


Click it and Unblock the Notifications











