ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి: అంజలి
ఆ ప్రకటనలో... ''గత అయిదారు రోజులుగా నా జీవితంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో కొందరు దర్శకుల్ని, నిర్మాతల్ని, సహనటుల్ని ఇబ్బంది పెట్టాను. జరిగిన సంఘటనల పట్ల ఎంతోమంది అభిమానులు, నా కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. ఇక నా దృష్టి పూర్తిగా సినిమాల మీదే. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించే బోల్ బచ్చన్ రీమేక్ కోసం మహారాష్ట్ర వెళ్తాను. ఆ తరవాత 'బలుపు' తదితర చిత్రాలు చేస్తాను'' అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ సంఘటనలో తనను మీడియా సహృదయంతో అర్థం చేసుకుందని, ఇక మీదటా అండగా నిలవాలని కోరారు. అలాగే నటిగా తన ప్రయాణం, వ్యక్తిగత జీవితం పూర్తిగా తన చేతుల్లోనే ఉన్నాయని అంజలి ప్రకటించారు. సోమవారం నుంచి సినిమా చిత్రీకరణల్లో పాల్గొంటానని తెలిపారు.
అంజలి స్వయంగా హాజరైన నేపథ్యంలో ఆమె మిస్సింగ్ కేసును పోలీసులు క్లోజ్ చేశారు. తన పిన్ని భారతీదేవి, బాబాయ్ సూరిబాబు వేధింపులు భరించలేక.. మానసిక ఒత్తిడికి గురై కొద్ది రోజులు ప్రశాంతంగా ఉండాలన్న ఉద్దేశంతోనే వెళ్లిపోయినట్లు పోలీసులకు వివరణ ఇచ్చారు. దీంతోపాటు కేసును ఉపసంహరించుకుంటున్నట్లు అంజలి తన సోదరుడు రవిశంకర్‌తో కలిసి డీసీపీకి లిఖితపూర్వకంగా తెలిపారు. దీంతో కేసును క్లోజ్ చేశారు.


Click it and Unblock the Notifications












