ప్రేమ విషయంలో నా జీవితం సావిత్రిలా అయ్యేదేమో?..... సమంత సంచలనం!
'మహానటి' సినిమా విడుదల తర్వాత సావిత్రి జీవితం ఎలా సాగింది అనే విషయం ప్రతి ఒక్కరికీ అర్థమైంది. అప్పటికే వివాహమై, భార్య పిల్లలు ఉన్న జెమినీ గణేశన్‌ను పెళ్లాడి ఉండకపోతే ఆమె జీవితం మరోలా ఉండేదేమో? అనే భావన ప్రతి ఒక్కరిలో ఏర్పడింది. 'మహానటి' చిత్రంలో కీలకమైన పాత్ర పోషించిన సమంత తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయ్యాయి. తన జీవితం కూడా సావిత్రిలా అయ్యేది, కానీ తృటిలో తప్పించుకున్నాను అని ఆమె చెప్పడం ఇండస్ట్రీలో సంచలనం అయింది.

సమంత చేసిన వ్యాఖ్యలు ఇవే
మహానటి సావిత్రి గురించి నాకు పెద్దగా తెలీదు. ఈ సినిమా చూశాక చాలా విషయాలు అర్థమయ్యాయి. కొన్ని కొన్ని చోట్ల ‘అరె.. ఇది నా కథలా ఉందే' అని అనిపించింది. ప్రేమ విషయంలో ఓసారి నేనూ అలానే నమ్మాను కదా? కానీ అదృష్టం కొద్దీ తృటిలో తప్పించుకున్నాను. అందులోంచి త్వరగా బయటపడ్డాను. లేదంటే నా కథా సావిత్రిలానే అయ్యేది.... అని సమంత వ్యాఖ్యానించింది.

చైతు దొరకడం నా అదృష్టం
నా జీవితంలోకి చైతన్య రావడం నా అదృష్టం. లేక పోతే నా లైఫ్ ఇలా ఉండేది కాదేమో? అని సమంత ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. అయితే సమంత వ్యాఖ్యల వెనక చాలా అర్ధాలు వెతుకుతున్నారు సినీ జనాలు.

చైతు కంటే ముందు సమంత ఎవరినైనా ప్రేమించిందా?
సమంత వ్యాఖ్యలను బట్టి చైతన్య కంటే ముందు సమంత ఎవరినైనా ప్రేమించిందా? అనే సందేహాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. తృటిలో తప్పించుకున్నాను అని సమంత వ్యాఖ్యానించడం ద్వారా..... చైతు కంటే ముందు మరో వ్యక్తితో సమంత ప్రేమలో పడిందా? సావిత్రి మాదిరిగా నమ్మిందా? చివరకు అతడి నిజస్వరూపం తెలియడంతో ఆ బంధం నుండి తప్పించుకుందా? ఇలా రకరకాలు ఊహాగానాలు మొదలయ్యాయి.

సమంతపై అప్పట్లో అనేక రూమర్లు
గతంలో హీరో సిద్ధార్థ్, సమంత మధ్య ప్రేమ వ్యవహారం నడిచినట్లు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. ఇద్దరూ వివాహం చేసుకోబోతున్నట్లు కూడా అప్పట్లో రూమర్స్ స్ప్రెడ్ అయ్యాయి. మరి ఆ రూమర్లకు.... సమంత చేసిన తాజా వ్యాఖ్యలకు ఏమైనా లింకు ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











