ఆ హీరో అయితేనే ఆవిడకు కిక్ వస్తుందట
పరిశ్రమలో ఎంత మంది హీరోలున్నా ఒక షారుఖ్ తో నటించినప్పుడు మాత్రమే అసలైన కిక్ వస్తుంది అంటోంది బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనా కపూర్. రా.వన్ మూవీ దీపావళికి విడుదలవుతున్న సందర్భంగా సినిమా ప్రమోషన్ల లో చురుకుగా పాల్గొంటున్న కరీనా....మీడియాతో మాట్లాడుతూ షారుఖ్ తో పని చేసే అవకాశం వస్తే ఆ అనుభూతి పూర్తిగా అనుభవిస్తాను, ఆ కిక్కే వేరు...అతను మంచి నటుడే కాదు, గొప్ప వ్యక్తి కూడా, అందుకే నటుడిగా ఉన్నత స్థాయికి చేరుకోగలిగారు అని పొగడ్తలతో ముంచెత్తింది.
రా.వన్ సినిమా రిజల్ట్ కోసం షారుఖ్ ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు, నేను కూడా అంతకు మంచిన ఆత్రుతతో ఎదురు చూస్తున్నాను, భారీ సాంకేతిక విలువలతో కూడి ఈ చిత్రం ఇప్పటి వరకు వచ్చిన సినిమాలన్నింటీలోనూ సంచలనం సినిమా నిలుస్తుందని భావిస్తున్నాను, తప్పకుండా సినిమా భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది అన్నారు. ఈ సినిమాలో నేను గత సినిమాల కంటే ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తాను అని చెప్పకొచ్చారు.
షారుఖ్ ఖాన్ సొంత బ్యానర్ రెడ్ చిల్లీస్ పతాకంపై రా.వన్ రూపొందుతోంది. ఇందులో షారుఖ్ హీరో కాగా, అతని భార్య గౌరీ ఖాన్ ఈ సినిమాకు నిర్మాత. ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, తమిళ వెర్షన్‌లలో కూడా ఒకే సారి విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. షారుఖ్ సరసన కరీనా నటిస్తోంది. అర్జున్ రాంపాల్, షహానా గోస్వామిలు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అనుభవ్ సిన్హా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ శేఖర్ సంగీతం వహిస్తున్నారు. సైన్స్ ఫిక్స్ నేపథ్యంలో ఈ సినిమా కథను సమకూర్చాడు దర్శకుడు అనుభవ్ సిన్హా. ఈ సినిమా అక్టోబర్ 26న థియేటర్లలో సందడి చేయనుంది. చాలా కాలంగా భారీ హిట్లు లేని షారుఖ్ ఈ సినిమా ద్వారా తన తన సత్తా చాటడానికి సిద్ధం అవుతున్నాడు.


Click it and Unblock the Notifications











