ఆమెను మేనేజరే మోసం చేసాడు

ఈ బాలీవుడ్ తార ఆ మధ్య వరస ఫ్లాప్ లలో నటించింది. ఒక్కసారి ఇలా ఎందుకు అని చూసుకున్న ఆమెకు అసలు విషయం బోధపడిందంటోంది. హసీనా వంటి సెక్స్ సినిమాలో నటించటానికి, 36 చైనా టౌన్ వంటి చిత్రాల్లో చిన్న పాత్రలో కనపడటానికి కారణం తన మేనేజర్ భాబు భాయి చేసిన మోసమేనని ఇప్పుడు భాద పడుతోంది. తాజాగా సూరత్ భారతాజ్య "Ek Vivaah... Aisa Bhi" లో చేసిన ఆమెకు ఆ సినిమా ఫరవాలనిపించుకోవటంతో కాస్త తేరుకున్న తర్వాత పరిస్దితులను ఎనలైజ్ చేసుకున్నానంటోంది.
అంతేగాక వర్మతో ఖల్లాస్ అంటూ చేసిన ఐటం సాంగ్ తర్వాత వరసగా హిట్స్ లో ఉండాల్సింది పోయి చాలా ఇబ్బందులు పడ్డానంటోంది. ఏదో అప్పటికీ వర్మ మరో చిత్రం శబరిలో తనను తీసుకోవటం ఆనందాన్ని కలుగ చేస్తోందని చెప్పుకొస్తోంది. ఇక ఆ మేనేజర్ ని తీసేసానని అతనితో ఎవరూ తన గురించి,డేట్స్ గురించి సంప్రదించవద్దని ప్రెస్ మీట్ పెట్టి చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











