ప్రతిరోజూ శీల పరీక్ష అక్కర్లేదు, ఆ ముగ్గురిపై నో మోర్ డిస్కర్షన్స్: బండ్ల గణేష్

సినిమా నటుడిగా, నిర్మాతగా కంటే... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భక్తుడిగానే ఎక్కువ పాపులర్ అయ్యారు బండ్ల గణేష్. సినిమా రంగంలో నటుడిగా ఉన్నా, నిర్మాతగా పలు సినిమాలు చేసినా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంటరైన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన ఎప్పుడూ మాట మార్చలేదు.

తను మీడియా ముందుకు వచ్చిన ప్రతి సందర్భంలోనూ పవన్ కళ్యాణ్ నాకు దేవుడు, ఆయనకు నేను భక్తుడిని అని గణేష్ నొక్కివక్కానించాడు. పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టిన తర్వాత పవర్ స్టార్ తప్పులు ఎత్తి చూపుతూ గణేష్‌తో ఏదో ఒక కామెంట్ చేయించేందుకు కొందరు మీడియా ప్రతినిధులు ప్రయత్నించారు. ఆ సమయంలో అవసరం అయితే ఆ ఇంటర్వ్యూ నుంచి బయటకు వచ్చే ప్రయత్నం చేశారు కానీ నోరుమాత్రం జారలేదు.

వారంటే ఎప్పటికీ నాకు ప్రాణం

వారంటే ఎప్పటికీ నాకు ప్రాణం

తాజాగా బండ్ల గణేష్ తన ట్విట్టర్లో వరుస ట్వీట్లు చేశారు. కారణం ఏమిటో? ఎవరు ఆయన్ను నొప్పించారో కానీ.... మరోసారి తన భక్తిని చాటుకున్నారు. ‘‘జన్మనిచ్చిన తల్లిదండ్రులు... బ్రతుకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ అంటే ఎప్పటికీ నాకు ప్రాణం'' అంటూ ట్వీట్ చేశారు.

ప్రతిరోజు నేను శీల పరీక్షను చేసుకునే అవసరం లేదు

ప్రతిరోజు నేను శీల పరీక్షను చేసుకునే అవసరం లేదు

నా తల్లిదండ్రుల విషయంలో, పవన్ కళ్యాణ్ విషయంలో... ప్రతిరోజు నేను శీల పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు... అని బండ్ల గనేష్ చెప్పుకొచ్చారు. మరి బండ్ల గణేష్ ఇంతలా రియాక్ట్ అవ్వడానికి కారణం ఎవరు? ఆయన్ను ఈ విషయంలో రెచ్చగొట్టింది ఎవరు? అనేది హాట్ టాపిక్ అయింది.

నో మోర్ ఆర్గ్యుమెంట్స్... నో మోర్ డిస్కర్షన్స్

నో మోర్ ఆర్గ్యుమెంట్స్... నో మోర్ డిస్కర్షన్స్

ఈ ముగ్గురి విషయంలో నో మోర్ ఆర్గ్యుమెంట్స్... నో మోర్ డిస్కర్షన్స్ అంటూ ట్విట్టర్ ద్వారా ఘాటుగానే సమాధానం ఇచ్చారు బండ్ గణేష్. ఏపీలో పల్నాడు గొడవల నేపథ్యంలో అధికార పక్షం, ప్రధాన ప్రతిపక్షం నాయకులను నమ్మవద్దు అని గణేష్ నిన్న వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

సినిమాల్లో నటుడిగా...

సినిమాల్లో నటుడిగా...

2009లో ‘ఆంజనేయులు' సినిమా ద్వారా నిర్మాతగా అవతారం ఎత్తిన బండ్ల గణేష్ 2015లో టెంపర్ తర్వాత నిర్మాణ రంగానికి దూరం అయ్యారు. ప్రస్తుతం మళ్లీ నటుడిగా తన ప్రయాణం సాగిస్తున్నారు. గణేష్ ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X