For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  రెండు తరాలైనా తరగదు: మహానటి సావిత్రి ఆస్తులపై కూతురు హాట్ కామెంట్!

  By Bojja Kumar
  |

  మహానటి 'సావిత్రి' గురించి రకరకాల వార్తలు ప్రచారంలో ఉ న్నాయి. స్టార్ హీరోయిన్ గా ఉన్నపుడు బాగా సంపాదించిన ఆమె తర్వాత తాగుడుకు బానిసగా మారి జీవితం చివరి దశలో తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల్లో గడిపిందని, అనారోగ్యానికి చికిత్స చేయించుకోవడానికి కూడా డబ్బు లేక దీనమైన స్థితిలో మరణించిందని అంటుంటారు.

  అయితే ఈ ప్రచారం అంతా అబద్ధమని అంటున్నారు సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి. అమ్మ ఏ విధమైన ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొలేదని, ఆమె సంపాదించిన డబ్బుతోనే తాము ఇప్పటికీ సుఖంగా బతుకుతున్నామని తెలిపారు.

  డబ్బు పోగొట్టుకున్న మాట నిజమే కానీ...

  డబ్బు పోగొట్టుకున్న మాట నిజమే కానీ...

  తన తల్లి కొత్త డబ్బు పోగొట్టుకొన్నమాట నిజమే, కానీ ఆర్థిక ఇబ్బందులు మాత్రం లేవు. తనకు, తన సోదరుడికి చాలా డబ్బు అందజేశారు. ఆమె వల్లే తాము ఇప్పటికీ ఎటువంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఆర్ధికంగా ఉన్నత స్థితిలో బతుకుతున్నామని తెలిపారు.

  Sai Pallavi Is Like Mahanati Savitri : Sai Chand
  రెండు తరాలైనా తరగదు

  రెండు తరాలైనా తరగదు

  తన తల్లి ద్వారా సంక్రమించిన ఆస్తి మరో రెండు తరాలు గడిపినా తరగనంత ఉందని విజయచాముండేశ్వరి చెప్పడం గమనార్హం. తన తల్లి జీవితంపై వస్తున్న ‘మహానటి' సినిమాలో అన్నీ నిజాలే చెబుతారని ఆశిస్తున్నట్లు చాముండేశ్వరి అన్నారు.

  వాస్తవాలే చూపండి

  వాస్తవాలే చూపండి

  తన తల్లి సావిత్రి గురించి భవిష్యత్ తరాలకు వాస్తవాలు తెలియజేసేలా ‘మహానటి' సినిమా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నాను, ప్రచారంలో ఉన్న కల్పితాలను, పుకార్లు ఈ సినిమా ద్వారా మాయం అవుతాయని భావిస్తున్నట్లు తెలిపారు.

  షరతులతో కూడిన అనుమతి

  షరతులతో కూడిన అనుమతి

  అమ్మ(సావిత్రి) జీవితంపై సినిమా తీస్తామని దర్శక నిర్మాతలు తనను సంప్రదించగానే షరతులతో కూడిన అనుమతి ఇచ్చినట్లు వెల్లడించారు.

  అమ్మ, నాన్న మధ్య గొడవలు

  అమ్మ, నాన్న మధ్య గొడవలు

  తనకు 16 ఏళ్ల వయసులో వివాహం చేశారని, తన వివాహానికి రెండేళ్ల ముందు నుండే అమ్మ సావిత్రి, నాన్న జెమిని గణేషన్ మధ్య విభేదాలు, గొడవలు మొదలయ్యాయని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.

  ఆ వయసులో అర్థం కాలేదు

  ఆ వయసులో అర్థం కాలేదు

  ఇద్దరి మధ్య ఎందుకు గొడవలు వచ్చాయో ఆ వయసులో తనకు అర్థం కాలేదని, వారు గొడవపడ్డప్పటికీ తనతో ప్రేమగా ఉండేవారని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.

  తమ్ముడు ఎక్కువ ఇబ్బంది పడ్డాడు

  తమ్ముడు ఎక్కువ ఇబ్బంది పడ్డాడు

  అమ్మా నాన్నల మధ్య గొడవల ప్రభావం నాపై పడలేదు. కానీ తమ్ముడపై ఆ ప్రభావం బాగా పడిందని విజయచాముండేశ్వరి చెప్పుకొచ్చారు.

  అమ్మ అమాయకురాలు

  అమ్మ అమాయకురాలు

  తన తల్లి చాలా అమాయకురాలని, ఏదైనా సమస్య వస్తే ఏం చేయాలో కూడా ఆమెకు తెలిసేది కాదు. అపుడు ఆమెకు సరైన సలహాలు ఇచ్చే వారు కూడా ఎవరూ ఉండేవారు కాదు. ఆ అమాయకత్వంతో తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా నష్టపోయింది, కొన్ని సార్లు చెడు జరిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపారు.

  అందుకే మద్యానికి బానిసయ్యారు

  అందుకే మద్యానికి బానిసయ్యారు

  సమస్యలు చుట్టుముట్టడంతో ఒత్తిడితో ఆమె మద్యానికి బానిసయ్యారు. ఆ ఒత్తిడితోనే 19 నెలలు కోమాలోకి వెళ్లిపోయారు. అమ్మను అలా చూడటం నరకంలా అనిపించింది. అమ్మ మళ్లీ మామూలు మనిషి అవుతుందనుకున్నాం. కానీ మా ఆశలపై నీళ్లు చల్లుతూ ఆమ్మ వెళ్లిపోయారు అని విజయచాముండేశ్వరి ఆవేదన వ్యక్తం చేసారు.

  నాన్న బాధ పడ్డారు

  నాన్న బాధ పడ్డారు

  అమ్మతో విబేధాలు ఉన్నప్పటికీ అమ్మను బెడ్ మీద చూసి నాన్న చలించిపోయారు, ఆయన ఎంతో మనోవేదన అనుభవించారు అని విజయ చాముండేశ్వరి అప్పటి చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు.

  ఆస్తులు పోయి పేదరికం అనేది అవాస్తవం

  ఆస్తులు పోయి పేదరికం అనేది అవాస్తవం

  అమ్మ ఆస్తులు పొగొట్టుకున్నారని, చివరి రోజుల్లో పేదరికం అనుభవించారని ఉన్న కథనాల్లో నిజం లేదని చాముండేశ్వరి తెలిపారు. అమ్మ చనిపోయాక కూడా తాము ఎలాంటి ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోలేదని, అమ్మ ఎంత పోగొట్టుకున్నా, అంతకంటే ఎక్కువే సంపాదించారని తెలిపారు.

  బయోపిక్ తీస్తానంటే షరతులతో ఒప్పుకున్నాను

  బయోపిక్ తీస్తానంటే షరతులతో ఒప్పుకున్నాను

  తల్లి జీవితంపై బయోపిక్ తీస్తామని నా దగ్గరకు వచ్చిన దర్శక నిర్మాతలకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చాను. మొత్తం స్క్రిప్టు చదవాలనేది నా మొదటి షరతు, తెరపై పాజిటివ్ విషయాలను మాత్రమే చూపించాలి అనేది మరో షరతు, తన తల్లి నటిగా ఎదిగిన విధానం భావి తరాలకు తెలియానే ఉద్దేశ్యంతోనే ఒప్పుకున్నట్లు తెలిపారు చాముండేశ్వరి.

  English summary
  Savitri daughter Vijaya Chamundeswari said that her mother never struggled financially.. she was financially in a comfortable position and she gave enough properties to them as well.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X