'పంజా'లో విలన్ పాత్ర హైలెట్స్

By Srikanya

పవన్ కళ్యాణ్ పంజాలో తాను మున్నా అనే నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రను పోషిస్తున్నట్లు అడవి శేషు చెప్పారు. ఆయన తన పాత్ర గురించి మాట్లాడుతూ తాను పవన్ కళ్యాణ్ కి ఫ్యాన్ ని అనీ,ఆయనతో కలిసి నటించాలనే డ్రీమ్ తనకు తీరిందని అన్నారు. ఇక పవన్ గురించి చెపుతూ.. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ మనిషి. అంత పెద్ద స్టార్ అయినా ఆయనలో అలాంటి వేమీ కనిపించవు. అందరితో చాలా గౌరవంగా మెలుగుతారు. అంతెందుకు ఒక రోజు నేను షూటింగ్ గ్యాప్ లో ఒంటిరిగా కూర్చుని ఉంటే వచ్చి నా ప్రక్కన కూర్చుని చాలా సేపు మాట్లాడారు. నేను ఇప్పటికీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నాతో అంతసేపు మాట్లాడాడు అంటే నమ్మబుద్ది కాదు. ఆయనలో ఒక రకమైన తేజస్సు ఉంటుంది. ఈ చిత్రంలో నా పాత్ర అందరినీ స్టన్నింగ్ కి గురి చేస్తుంది అన్నారు.

ఇక దర్సకుడు విష్ణు వర్దన్ గురించి చెపుతూ..ఆయన గొప్ప దర్శకుడు మాత్రమే కాదు మంచి నటుడు కూడాను. ఆయన మా నుంచి ఏది ఎక్సపెక్ట్ చేస్తున్నారో దాన్ని చేసి చూపించి వివరించి ఆయనకు కావాల్సిన విధంగా ఎఫెక్టు రాబట్టుకునేవారు. ప్రతీ విషయంలోనూ ఆయనకు చాలా స్పష్టత ఉంది అన్నారు. ఇక పంజా చిత్రం డిసెంబర్ తొమ్మిదివ తేదీన విడుదల అవుతోంది. యువన్‌శంకర్‌రాజా సంగీతం కూడా ఈ సినిమాకు ఎస్సెట్. ఈ సినిమాను తమిళంలో కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాతలు నీలిమ తిరుమలశెట్టి, శోభు యార్లగడ్డ తెలిపారు. ఈ చిత్రానికి స్క్రీన్‌ప్లే: రాహుల్ కోడా, మాటలు:అబ్బూరి రవి, కెమెరా: పి.ఎస్.వినోద్, ఆర్ట్: సునీల్‌ బాబు, ఎడిటింగ్: శ్రీకర్‌ప్రసాద్, ఫైట్స్: శ్యామ్ కౌశల్, స్టైలింగ్:అనూవర్థన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X