మహేష్.. ఇంటి వాస్తు సెంటిమెంట్
మహేష్ బాబు దూకుడుకి ముందు కొత్త ఇంటికి మారారన్న సంగతి తెలిసిందే. అక్కడికి వెళ్లాక కలిసి వచ్చిందంటున్నారు ఆయన. మీడియాతో మాట్లాడుతూ...నా కొత్త ఇల్లు చాలా బాగుంది. ఆ ఇంటి వాస్తు చాలా ఫెరఫెక్ట్ గా ఉంది. ఆ ఇంట్లోకి మారాకే ...దూకుడు విడుదలైంది. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ విడుదలైంది. రెండూ బ్లాక్ బస్టర్ సినిమాలే. నేను ఆ ఇంట్లోకి మారాక ఇంతలా నా సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావటంతో చాలా ఆనందంగా ఉన్నాను అన్నారు. బిజినెస్ మ్యాన్ విజియోత్సాహంలో ఉన్న మహేష్ ఓ ఇంగ్లీష్ డైలీతో మాట్లాడుతూ ఇలా స్పందించారు.
అలాగే నేను దూకుడు చిత్రం పూర్తైన వెంటనే ఒక్క రోజు కూడా గ్యాప్ తీసుకోకుండా బిజినెస్ మ్యాన్ చిత్రంలో దిగిపోయాను. ఈ రెండు క్యారెక్టర్స్ చాలా డిఫెరెంట్. దాంతో కొద్దిగా మొదటి రోజుల్లో నెర్వస్ గా ఫీలయ్యాను. అయితే జగన్ గారుని ఫాలో అవటంతో బాగా ఫెరఫెక్ట్ గా సినిమాను పూర్తి చేసి ఈ రేంజి విజయం సాధించగలిగాను అన్నారు.ఇక దూకుడు,బిజినెస్ మ్యాన్ వరస విజయాలతో మహేష్ ఇప్పుడు హాట్ స్టార్ గా మారారు. దాంతో ఇప్పుడాయిన రెమ్యునేషన్ కూడా బాగా పెరిగిందని అంతర్గత వర్గాల సమాచారం. సినిమాకు తొమ్మిది కోట్లు రెమ్యునేషన్ అని,ఓవర్ సీస్ రైట్స్ లో పిప్టీ పర్శంట్ షేర్ అని చెప్తున్నారు. ఎందుకంటే ఓవర్ సీస్ మార్కెట్ లో ఇప్పుడు మహేష్ నెంబర్ వన్ గా ఉన్నారు.


Click it and Unblock the Notifications











