ప్రభాస్ తో ఆలస్యమయ్యేలా ఉంది..ఈలోగా 'ఈగ': రాజమౌళి
"నా తదుపరి చిత్రం ఆర్.కె.ప్రొడక్షన్స్‌లో ప్రభాస్‌తో చేస్తాను. అయితే ప్రభాస్ వేరే సినిమాతో బిజీగా ఉండటం వల్ల కాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఈలోగా 'ఈగ' అనే ప్రయోగాత్మక చిత్రం చేద్దామా? వద్దా? అనే సంశయంలో ఉన్నాను. మహేష్ బాబుతో కథా చర్చలు జరిగాయి. నాగార్జునతో నాన్నగారు ఒక సినిమా రూపొందిస్తున్నారు. ఆ సినిమాలో యాక్షన్ ఘట్టాల్ని నేను తెరకెక్కిస్తాను" అన్నారు అంటూ రాజమౌళి తన తదుపరి ప్లాన్ ని మీడియాకు వివరించారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వం వహించిన 'మర్యాద రామన్న' చిత్రం ప్రమోషన్ కోసం మర్యాద యాత్రలు జరుపుతున్నారు. ఆ యాత్రను ఈ నెల 6 నుంచి కొనసాగించబోతున్నారు.
ఇక 'ఈగ' చిత్రంలో హీరో ఉండరని ఎగిరే ఈగ ప్రధాన పాత్ర వహిస్తుందని తెలుస్తోంది. ఈ మేరకు గత కొంతకాలంగా స్క్రిప్టు వర్క్ నడుస్తోంది. పూర్తి స్ధాయి గ్రాఫిక్స్ తో కూడిన ఓ ప్రయోగాత్మక చిత్రంగా ఈ 'ఈగ' ని తీర్చిదిద్దాలని రాజమౌళి భావిస్తున్నారు. హాలీవుడ్ లో తేనెటీగ ప్రధానపాత్రలో వచ్చి హిట్టయిన బీ మూవీ (2007) తరహాలో ఈ చిత్రం ఉండబోతోందని సమాచారం. అయితే 'ఈగ' మాత్రమే గ్రాఫిక్స్ అనీ మిగతా పాత్రల్లో మనుష్యులు ఉండనున్నారని చెప్తున్నారు. ఇక కథ మొత్తం 'ఈగ' పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతుంది.


Click it and Unblock the Notifications











