శ్రీదేవితో సినిమా తీస్తానంటున్న భర్త బోనీ కపూర్
హైదరాబాద్: ఒకప్పుడు అతిలోక సుందరిగా ఇటు సౌత్ సినీ పరిశ్రమలతో పాటు, అటు బాలీవుడ్లోనూ సత్తా చాటిన శ్రీదేవి....పెళ్లయిన తర్వాత సినిమాలు దూరమై చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత ‘ఇంగ్లిష్ వింగ్లిష్' చిత్రం ద్వారా రీ ఎంట్రీ ఇచ్చింది. 2012 ఈ సినిమా విడుదలైంది. ఆ సినిమా తర్వాత ‘బాంబే టాకీస్' అనే చిత్రంలోని ఓ సాంగులో స్పెషల్ అప్పియరెన్స్ మినహా....ఆమె ఏ సినిమాలోనూ నటించలేదు.
చాలా కాలం తర్వాత ఆమె ‘పులి' అనే తమిళ చిత్రంలో నటించడానికి ఒప్పుకుంది. విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి చింబుదేవన్ దర్శకుడు. ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్రమిది. ఇందులో విజయ్ తల్లి పాత్రలో శ్రీదేవి నటిస్తోంది. శృతి హాసన్, హన్సిక, సుదీప్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఆ సినిమా సంగతి పక్కన పెడితే....శ్రీదేవి ప్రధాన పాత్రలో ఓ సినిమా రాబోతోంది. ఈ చిత్రాన్ని స్వయంగా శ్రీదేవి భర్త బోనీ కపూర్ తెరకెక్కించబోతున్నారు. ఈ చిత్రం మహిళా ప్రాధాన్యత గలదిగా ఉంటుందన్నారు. రెండేళ్ళ క్రితం శ్రీదేవి రీఎంట్రీ ఇచ్చిన ఇంగ్లిష్ వింగ్లిష్ చిత్రం కంటే ఇది విభిన్నంగా ఉండనుందట. బాలీవుడ్‌లో ఇది మరొక కళాత్మక చిత్రం అవుతుందన్నారు.
‘ఇంగ్లిష్ వింగ్లిష్' శ్రీదేవి రీ ఎంట్రీకి చాలా ప్లస్సయింది. అప్పటి వరకు లైమ్ లైట్ లో లేని ఆమె మళ్లీ.....సినిమా పరిశ్రమలో యాక్టివ్ అయింది. పలు వాణిజ్య కార్యక్రమాలు, ఫ్యాషన్ షోలు, సినిమా రంగానికి సంబంధించిన ఇతర కార్యక్రమాల్లో కూడా ఆమె బిజీ అయిపోయారు.


Click it and Unblock the Notifications











