twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కేసీఆర్ పై మరోసారి రాంగోపాల్‌వర్మ

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : గతంలో కేసీఆర్ ముక్కు గురించి కామెంట్ లు ట్విట్టర్ లో చేసిన రామ్ గోపాల్ వర్మ మరోసారి ఆయన గురించి ట్వీట్ చేసారు. సమంత,తమన్నా, ఇలియానా కలిపితే ఉండే అందమంతా కేసీఆర్ లో కనిపిస్తోందంటూ వర్మ ట్విట్టర్ ద్వారా తెలిపారు. హిట్లర్ ఓ చెడ్డ కేసీఆర్...కానీ కేసీఆర్ ఓ మంచి హిట్లర్ అంటూ ఓ వ్యాఖ్యను కొసమెరుపుగా పోస్ట్ చేసారు.

    తాను కొత్తగా కేసీఆర్‌ పేరుతో చిత్రం తీస్తున్నట్టు దర్శకుడు రాంగోపాల్‌వర్మ ట్విట్టర్‌లో తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి మంచి పాలన అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

    అలాగే ...కేసీఆర్ అనే పదం ఎన్ టీఆర్ అనే పదం కంటే వినటానికి ఇంకా బాగుంటుందని మరో ట్వీట్ లో ఆయన పేర్కొన్నారు. అధికారం, దర్పం లాంటి అంశాలు కేసీఆర్ ను అందగాడిని చేసాయి అన్నారు.

    My next movie’s name is “KCR”- RGV

    గతంలో....

    వర్మ ట్వీట్ చేస్తూ ... ఆయనది లవ్ లీ ఫేస్ అని,ఆయన అంతర్ సౌందర్యం,ఆలోచనలు ఆయన ముఖంలో ప్రతిఫలిస్తాయని అన్నారు. ఒకరి ముఖం అంటే వారి లోపలి ఎమోషన్స్ కి ప్రతిరూపమని,ఈ విషయం కేసీఆర్ ముఖం కరెక్టుగా ఎక్సప్లెయిన్ చేస్తుందని అన్నారు.

    అలాగే కేసీఆర్ ని ఒక్కసారి చూస్తే ప్రపంచంలో ఎవరూ మరిచిపోలేరని, చివరకు గజనీ సైతం గుర్తు పెట్టుకుంటాడని అన్నారు. తనతో ఓ కాలేజ్ అమ్మాయి...కేసీఆర్ పై తమ స్నేహితురాళ్ళలో చాలా మందికి క్రష్ ఉందని చెప్పిందని,వారు సిటీలో ఎక్కడ చూసినా కేసీఆర్ కనపడటాన్ని థ్రిల్ అవుతున్నారని చెప్పారు.

    అయితే ఆడవాళ్లు కేసీఆర్ ని ఇష్టపడటాన్ని తాను ఆశ్చర్యపోలేదని,ఆడవాళ్లు ఎప్పుడూ పవర్ ని కోరుకుంటారని,ముఖ్యంగా కేసీఆర్ ముక్కు ఆ పవర్ ని తెలియచేస్తోందని అన్నారు.అదే అమ్మాయి...హైదరాబాద్ లో మరిన్ని పెద్ద పెద్ద కేసీఆర్ హోర్డింగ్ లు,విగ్రహాలు పెట్టడం ద్వారా మరింత అందంగా తయారవుతుందని అంది. టీఆర్ ఎస్ ఆఫీస్ బయిట తమకు కేసీఆర్ లో దేవుడు ని చూసుకుంటున్నామని, రాముడు,కృష్ణుడు కన్నా ఎక్కువగా అంటూ చెప్పిందని ఆయన ట్వీట్ చేసారు.

    English summary
    
 Ram Gopal Varma on Twitter said that... Just in the sheer power combination of presence, persona and intensity KCR is more beautiful than Samantha,Thamanna and Ileana put together. Not long ago he compared KCR with Bal Thackrey and also made few remarks on his nose. Looks like Ram Gopal Varma is planning to shoot in 2000 acres of Cinema City, which KCR is planning to start.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X