లక్స్ పాపనీ ..ఓ లుక్కేయండి

అప్పట్లో ఫ్లోరా పేరుతో పూరీ జగన్నాధ్ చిత్రంలో నటించినా ఫలించలేదు. దాంతో ఆమె ఇఫ్పుడు మయూరిగా పేరు మార్చుకుంది.అలాగే తన పేరు మయూరిగా మార్చటానికి కారణం చెబుతూ...''సంఖ్యా శాస్త్రం ప్రకారం నేను మయూరిగా పేరు మార్చుకున్నాను.దీంతో కలిసి వస్తుందని భావిస్తున్నారు. ప్రస్తుతం చిన్నా దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆ ఇంటిలో' అనే సినిమాలో చేస్తున్నాను. అన్ని రకాల పాత్రల్లోనూ కనిపించి అలరించాలన్నదే నా తపన. అలాగే తెలుగు ప్రేక్షకులు నేటికీ నన్ను 'లక్స్ పాప'గా గుర్తుపెట్టుకున్నారు. ఆ తరహా ఐటం సాంగ్స్ చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను నటించినవాటిలో కామెడీ ఎక్స్‌ప్రెస్, పరమానంద శిష్యులు అనే చిత్రాలు విడుదలకు సిద్దంగా ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది.
ఆ మధ్య నిధి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన మైఖేల్ మదన కామరాజు చిత్రంలో ఆశాషైనీ పూర్తి స్ధాయి అందాలు ఆరబోతతో ప్రయత్నం చేసిందికానీ వర్కవుట్ కాలేదు. ఇప్పుడు అవకాశాలివ్వండీ అని అడుగుతోంది...పరిశ్రమలోని వారు పట్టించుకోవాలని కోరుకుందాం.


Click it and Unblock the Notifications











