మొదట్లో కష్టాలు, కన్నీళ్లు తప్పలేదు...సలోని
సునీల్ తో మర్యాద రామన్న చేసి సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది సలోని. ఈ విషయం ఆమె ప్రస్తావిస్తూ...ప్రతి మనిషికి ఒక లక్ష్యం ఉండాలి. గమ్యం సులువుగా చేరుకోవచ్చు అనుకుంటే చాలా పొరపాటు. ఆ దారిలో కష్టాలు, కన్నీళ్లు తప్పవు. నటిగా తొలి అడుగులు వేసేటప్పుడే నాకు విజయాలు దక్కలేదు. అయితే కంగారుపడకుండా ప్రయత్నాలు చేస్తూ వచ్చాను. ప్రయత్నానికి తగ్గ ఫలితం మర్యాద రామన్న రూపంలో దక్కింది. క్లిష్ట పరిస్థితుల్లో కూడా నవ్వుతూ ముందుకెళ్లగలిగితేనే మనం సాధించిన గెలుపుకో అర్థం ఉంటుంది అంది. ఇక సలోని ఇంతకుముందు..ధన 51, ఒక ఊరిలో, కోకిల చిత్రాలు చేసింది. అయితే అవేమీ ఆమెను భాక్సాఫీస్ వద్ద నిలబెట్టలేకపోయాయి. మర్యాదరామన్న చిత్రంతో ఆమెకు క్రేజ్ వచ్చింది.


Click it and Unblock the Notifications











