రేప్ సీన్ చేస్తుండగా హీరోయిన్‌కు గాయాలు

By Bojja Kumar

ముంబై: సినిమా కథ, సందర్బాన్ని బట్టి సినిమాల్లో రేప్ సీన్లు ఉండటం సర్వ సాధారణం. అయితే ఆ సీన్లు చేయడం అంత సులువేమీ కాదు. ఆ సీన్ రియల్ సీన్‌లా పండేందుకు నటీనటులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆ సీన్లో నటించే నటీనటుల మధ్య కోఫపరేషన్ ఉండటం ఎంతో ముఖ్యం. అలాంటిది లేక పోతే వారికి ఆ సీన్ భయానక అనుభూతిని మిగులుస్తుంది.

బాలీవుడ్ బ్యూటీలు రైమా సేన్, తిలోత్తమలు ఇలాంటి అనుభమే ఎదుర్కొన్నారు. ఈ సీన్ చేస్తుండగా ఇద్దరూ కూడా స్వల్పంగా గాయపడ్డారట. అయినా సరే ఓర్చుకుంటూ సీన్ పండేందుకు తమ వంతు సహాయం అందించారట. తమకు ఎదురైన అనుభవాన్ని వారు మీడియాతో పంచుకున్నారు. ఈ సీన్ చేస్తుండగా చాలా ఇబ్బంది పడ్డామని, ఇలాంటి సీన్లు చేస్తామని ఎప్పుడూ భావించలేదని తెలిపారు.

My Rape scene the toughest I have ever shot: Raima Sen

'నా కెరీర్లో ఇంత కష్టమైన సీన్ ఎప్పుడూ చేయలేదు. నా శరీరానికి ఏమైనా అవుతుందో అని భయపడ్డాను' అని రైమా సేన్ చెప్పుకొచ్చారు. తిలోతమ మాట్లాడుతూ...'రేప్ సీన్ చేయడానికి ప్రిపేర్ కావడం అనేది అంత సులవేమీ కాదు. ఆ సీన్ చూస్తే ప్రతి ఒక్కరికి తాము పడ్డ కష్టం ఏమిటో అర్థం అవుతుంది' అని తెలిపారు.

'చిల్డ్రన్ ఆఫ్ వార్' అనే సినిమాలో వీరు ఈ రేప్ సీన్ చేసారు. పాకిస్తాన్ సైనికులు బంగ్లాదేశ్ మహిళలపై జరిపిన దురాగతాల గురించి ఈ సినిమా సాగుతుంది. సినిమా లోని రేప్ సీన్ల గురించి దర్శకుడు దేవరాత్ మాట్లాడుతూ....భయానక పరిస్థితులకు అద్దం పట్టే విధంగా ఈ సినిమా ఉంటుందని తెలిపారు. మే 16వ తేదీన ఈచిత్రం విడుదలవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X