నా పాత్ర కోసం చూస్తారు: బాలకృష్ణ
బాలకృష్ణ ముఖ్య పాత్ర పోషించిన 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' చిత్రం ఈ రోజు విడుదలవుతున్న నేపథ్యంలో బాలయ్య 92.7 రేడియో స్టేషన్లో సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమిష్టి కృషితో సినిమా అద్భుతంగా వచ్చిందని, ముఖ్యంగా తన పాత్ర ఆకట్టుకుంటుందని, నా పాత్ర కోసం చూస్తారని, అభిమానులను మెప్పిస్తుందని...అన్నారు. మనోజ్ నటన విభిన్నంగా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందన్నారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఉలిక్కి పడటం ఖాయం అంటూ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం వ్యక్తం చేశారు బాలయ్య.
'ఊకొడతరా ఉలిక్కి పడతారా' చిత్రం ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడులైంది. బాలయ్య స్టార్ ఇమేజ్, మనోజ్ పెర్ఫార్మెన్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచాయి. శేఖర్ రాజా దర్శకత్వం వహించిన ఈచిత్రాన్ని మంచు ఎంటర్ టైన్మెంట్స్ బేనర్‌పై మంచు లక్ష్మి నిర్మించారు. చిత్రం గాంధర్వ మహల్ చుట్టూ తిరుగుతుంది.
గాంధర్వ మహల్ ఎపిసోడ్ పక్కనపెడితే హీరో మనోజ్-దీక్షాసేథ్‌లపై మధ్య చిత్రీకరించిన ప్రేమగీతాలు కనువిందుగా ఉండనున్నాయి. ఇప్పటికే 'ఊకొడతారా..ఉలిక్కి పడతారా' ట్రైలర్స్ రిలీజై మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. ఈ చిత్రానికి కథ, దర్శకత్వం శేఖర్ రాజా, బి. రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సమకూర్చారు. బెబో శశి సంగీతం అదించగా, బాలీవుడ్ సంగీత ద్వయం సలీమ్-సులేమాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించారు.


Click it and Unblock the Notifications











