నోరు జారినందుకు కాజల్ కవర్ చెయ్యలేక...
'నేనెప్పుడూ దక్షినాదికి చెందిన నటిగా ఫీలవటం లేదు.నేను అస్సలు అక్కడ నటిని అని కన్సిడర్ చేయను' అంటూ ఒళ్ళు పై తెలియకుండా మాట్లాడిన కాజల్ ఇప్పుడు అవకాశం దొరికితే చాలా కవర్ చేసుకోవటానికి ప్రయత్నిస్తోంది.తాజాగా సింగం ప్రమోషన్ గురించి మీడియాతో మాట్లాడుతూ ప్రస్తావన లేకపోయినా కావాలని... 'నటిగా నన్ను నిరూపించుకోవడానికి, నా పాపులార్టీ పెరగడానికి కారణం తెలుగు, తమిళ చిత్రాలే. నాకు లైఫ్ ఇచ్చిన ఈ రెండు రంగాలను వదులుకోను. ముఖ్యంగా నా క్రేజ్ పెరగడానికి కారణం తెలుగు చిత్రాలు. అందుకని టాలీవుడ్‌కి దూరమయ్యే ప్రసక్తే లేదు' అంది. అజయ్ దేవగన్ సరసన ఆమె నటించిన తొలి హిందీ చిత్రం 'సింగమ్" ఈ 22న విడుదలవుతోంది. రిజల్ట్ కోసం ఎదురుచూస్తోంది.


Click it and Unblock the Notifications











