నా ముద్దు చెండాలం కాదు - హీరోయిన్‌కు హీరో కౌంటర్
''నేను ఇప్పటి వరకు చాలా బాలీవుడ్ సినిమాలు చేశాను. కొన్ని సినిమాల్లో హీరోయిన్లతో లిప్‌లాక్ సీన్లు చేయాల్సి వచ్చింది. బిపాసా అయినా సరే ఇంకెవరైనా సరే అది కేవలం సినిమా ముద్దు, పర్సనల్‌గా ఏమీ ఉండదు. అలా అని చండాలంగా ఉండే ముద్దు సీన్లను నేనెప్పుడూ చేయలేదు, చేయబోను కూడా. కథకు తగిన విధంగా సీన్‌లో ఎమోషన్స్ కోసమే రొమాంటిక్ గా ఉంటాయి'' అని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు హీరో మాధవన్.
అయితే మాధవన్ ఇలా సమాధానం ఇవ్వడం వెనక ఓకారణం ఉందని, బిపాసా బసు వ్యాఖ్యలకు కౌంటర్ గానే ఆయన పై విధంగా జవాబిచ్చారని అంటున్నారు. 'జోడీ బ్రేకర్స్' చిత్రంలో మాధవన్‌తో ముద్దు సీన్లో పాల్గొన్న బిపాసా ఆ సీన్‌పై ఇటీవల మీడియాలో తెగ గగ్గోలు చేస్తోంది. అతనితో ఆ సీన్ చేస్తున్నప్పుడు తెగ ఇబ్బంది పడ్డానని, తనకు ఆన్ స్ర్కీన్ ముద్ద సీన్లు అంటే నచ్చవు అంటూ స్టేట్‌మెంట్లు ఇచ్చింది.
అంతకు ముందు వరకు జాన్ అబ్రహంతో, రణబీర్ కపూర్ లాంటి యువ హీరోలతో ముద్దున్లలో తెగ రెచ్చిపోయి నటించిన బిపాసా....మాధవన్‌తో చేసిన తర్వాతే ఇలాంటి కామెంట్లు చేయడం ఈ హీరోకి ఇబ్బంది కలిగించింది. దీంతో ఆమె వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వడానికే అలా చేశాడని అంటున్నారు.


Click it and Unblock the Notifications











