»   »  సెక్స్ సింబల్ గా చూస్తేనే ఖుషీ...

సెక్స్ సింబల్ గా చూస్తేనే ఖుషీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu
Neha Dhupia
కొంతమంది హీరోయిన్స్ కి సెక్స్ సింబల్ అని ఎక్కడ ముద్ర పడిపోతుందో అని భయం. దాంతో వారు వచ్చిన ఆఫర్స్ ని భూతద్దంతో నిశితంగా పరిశీలించి ఒప్పుకుంటూంటారు. కానీ జూలీ సినిమాతో పరిచయమైన నేహా దూపియాకి మాత్రం సెక్స్ సింబల్ అనే ట్యాగ్ మాత్రం భలే ఇష్టం. దానికోసం ఒక్కోసారి దుస్తులు కూడా త్యాగం చేసేస్తూంటుంది. అయితే పైకి మాత్రం వెరైటీ పాత్రలు నాకు కావాలి అని స్టేట్ మెంట్స్ ఇస్తూంటుంది. ఆ మధ్య ఆమె చేసిన చుప్ చుప్ కే లో గుజరాతి అమ్మాయి పాత్ర,డిల్లీ హైట్స్ లో యాడ్ ఎగ్జిక్యూటివ్ పాత్ర ఆమెకు నచ్చలేదుట. సింగ్ ఈజ్ కింగ్ లో ఆమె చేసిన యాక్షన్ సీన్స్ దర్శక,నిర్మాతలకు నచ్చాయి గానీ ఇండిడ్యువల్ గా పేరు తేలేదని తెగ భాధ పడిపోతోంది.

2002 లో మిస్ ఇండియ్ గా ఎన్నికైన నేహ కి సెక్స్ సింబల్ అనిపించుకోవటంలో ఉన్నంత ఆనందం మరొకదానిలో ఉండదంటోంది. ఇలా ఫిక్స్ అవటానికి ఆమెకి సొంత కారణాలు ఉన్నాయట. అయినా ఈ సెక్స్ సింబల్ అని అనిపించుకోవాలనే పిచ్చి ఏంటంటే మూతి మూడు వంకర్లు తిప్పి ఈ పేరు తెచ్చుకోవటం అంత ఈజీనేం కాదు . ఎక్కడో కొద్ది మందికి లభిస్తుంది. వారే గెలుస్తారు. నాకా అవకాశం ఉంది. అయినా ఆ సెక్స్ సింబల్ ని అనిపించుకోవటంలో ఉన్న ఆనందమే వేరు. అయినా ఎందుకనో ఈ మధ్య అంతా నాకు ఆ తరహా పాత్రలు కాకుండా క్యాజువల్ క్యారెక్టర్స్ ఇస్తున్నారు. పెద్ద ఫలితం ఏముంది. ఖాళీగా ఉండటం ఎందుకని చేయటం తప్ప అంది నిరాసగా...ఏమిటో ఈ కొత్త చింత అని విన్న వాళ్ళందరూ నోళ్ళు నొక్కకుంటున్నారు.

ఇక ఈ మధ్య సెక్స్ సింబల్ అనే ముధ్ర తనపై తొలిగిపోతోందనే బాధ కొత్తగా పట్టుకుందిట. దాంతో అలాంటి కథతో వచ్చిన వారికి వెంటనే కాల్షీట్స్ ఇస్తానని ఇండైక్ట్ గా ఆహ్వానిస్తోంది. ప్రస్తుతం ఆమె మరాఠి సినిమాలతో సహా రాత్ గయీ బాత్ గయీ,ఐయామ్ 24,పేయింగ్ గెస్ట్,ఇమ్రాన్ హస్మీ సరసన ఒకటి, ప్రియదర్శన్ దర్శకత్వంలో ఒకటి చేస్తోంది.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X