»   » రామ్ చరణ్ పెంపుడు కొడుకు ఇతడే: ‘ధ్రువ’ సెట్స్‌లో.. (ఫోటోస్)

రామ్ చరణ్ పెంపుడు కొడుకు ఇతడే: ‘ధ్రువ’ సెట్స్‌లో.. (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: రామ్ చరణ్‌, ఉపాసన వివాహం జరిగి జూన్ 14వ తేదీతో నాలుగేళ్లు పూర్తయింది. ఎంతో అన్యోన్యంగా దాంపత్య జీవితం లీడ్ చేస్తున్న ఈ జంట ఇప్పటి వరకు ఫ్యామిలీ ప్లానింగ్ విషయంలో దృష్టి పెట్టలేదు. రామ్ చరణ్ తన సినిమాలతో బిజీగా గడుపుతుంటే... ఉపాసన కూడా అపోలో ఆసుపత్రి వ్యవహారాల్లో మునిగి తేలుతుంది.

రామ్ చరణ్, ఉపాసన కుటుంబ సభ్యులు, అభిమానులు మాత్రం ఈ జంట నుండి శుభవార్త ఎప్పుడు వింటామా? అని ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్, ఉపాసన మాత్ర తమకు పిల్లలు లేని లోటును ఫీలవ్వడం లేదు. ఎందుకంటే ఆల్రెడీ వారికి పెంపుడు కొడుకు ఉన్నాడు కాబట్టి. అతడి పేరు బ్రాట్.

బ్రాట్ అంటే మరెవరో కాదు... రామ్ చరణ్, ఉపాసనలు పెంచుకుంటున్న కుక్కపిల్ల. ప్రస్తుతం హైదరాబాద్ లో ధ్రువ చిత్రానికి సంబంధించిన షూటింగ్ జరుగుతుంటే అక్కడికి 'బ్రాట్' కూడా వచ్చాడు. బ్రాట్ తో కలిసి ఫోటో దిగిన రామ్ చరణ్..... దాన్ని ఎఫ్.బి పేజీలో పోస్టు చేసాడు.

'మై సన్ బ్రాట్...నిన్న సాయంత్రం సెట్స్‌కు వచ్చాడు. షూటింగ్ పూర్తయ్యే వరకు ఈ రోజు ఉదయం 6 గంటల దాకా నాతోనే ఉన్నాడు' అంటూ రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన ఫోటోస్..

కొడుకుతో కలిసి రామ్ చరణ్

కొడుకుతో కలిసి రామ్ చరణ్

రామ్ చరణ్ ఈ ఫోటో పోస్టు చేయడంతో పాటు.. ఇతడే నా కొడుకు అని ప్రకటించేసాడు.

హిప్ హాప్ తమీజా

హిప్ హాప్ తమీజా

ధ్రువ చిత్రానికి తమిళ సంగీత దర్శకుడు హిప్ హాప్ తమీజా సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హిప్ హాప్ తమీజ సెట్స్ కు వచ్చిన సందర్భంగా చెర్రీతో కలిసి తీసుకున్న ఫోటో ఇది.

మై డబ్ ఫర్ రామ్

మై డబ్ ఫర్ రామ్

మై డబ్ ఫర్ రామ్ పేరుతో ఇటీవల ఓ కాంటెస్టు నిర్వహించారు. మీకు ఇష్టమైన రామ్ చరణ్ డైలాగులు చెప్పే కాంటెస్ట్ ఇది. విజేతలకు ధ్రువ సెట్స్ లో రామ్ చరణ్ ను కలిసే అవకాశం కల్పిస్తారు.

వర్కౌట్స్

వర్కౌట్స్

ఈ సినిమాలో రామ్ చరణ్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం చాలా వర్కౌట్స్ చేస్తున్నాడు. ఇటీవల 3వ షెడ్యూల్ ప్రారంభాని ముందు పోస్టు చేసిన పిక్ ఇది. 32 నిమిషాల్లో 5.5కి.మీ పరుగెత్తడంతో పాటు 30 నిమిషాల పాటు కిల్లర్స్ ఆబ్స్ వర్కౌట్ చేసినట్లు చెర్రీ చెప్పుకొచ్చారు.

కాశ్మీర్..

కాశ్మీర్..

ధ్రువ చిత్రానికి సంబందించిన షూటింగ్ ఇటీవల కాశ్మీర్ లో జరిగిన సంగతి తెలిసిందే.

English summary
"My son 'BRAT' on my sets yesterday... Stayed up along with me till we wrapped at 6am this morning" Ram Charan said.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu