మా వాడికి అమ్మాయిలేం కొత్తకాదు...

అయినా కంగనా తమ కొడుక్కి మొదటి గర్ల్ ప్రెండ్ కాదని ...ఇంతకు ముందు కూడా ఇలా అమ్మాయిలను ప్రేమించానంటూ వచ్చాడని ..ఎప్పటికప్పుడు ఆపుచేస్తూ వస్తున్నానని కెరీర్ ముఖ్యమనే విషయం వాడు గ్రహిస్తాడని ఆశిస్తాడని అన్నాడు. ఇదే విషయాన్ని కొనసాగిస్తూ...అతను పదమూడేళ్ళ వయస్సులో ఓ అమ్మాయిని ప్రేమించానంటూ వచ్చాడు. తర్వాత కొంత కాలానికి ఏం జరిగిందో ఏమో ఆమెతో విడిపోయాడు. ఇక కంగనా వర్క్ నాకు చాలా ఇష్టం..ప్రొపిషినల్ ఆమె చాలా గొప్పది..అంత మాత్రాన ఆమె నాకు కోడలు కాబోదు. మరో పదేళ్ళయినా ఆమెను మా అబ్బాయి పెళ్ళి చేసుకోడు అంటూ తేల్చేసాడు. కాబట్టి కంగనా బాల్ నీ కోర్టులోనే ఉంది...ఆలోచించు అంటున్నారు బాలీవుడ్ వాసులు.


Click it and Unblock the Notifications











