అమేజింగ్ నాకంటే చాలా అందంగా ఉంది నా స్టాచ్యూ: కరీనా కపూర్
తన జీరో సైజు నడుము అందాలతో కుర్రకారును ఆకట్టుకున్న కరీనాకపూర్... ఇక నుంచి మైనపు బొమ్మగా కూడా కనువిందు చేయబోతోంది. యుకె లోని ప్రముఖ మ్యూజియంలో ఈ కుందనపు మైనపుబొమ్మ కొలువుదీరనుంది. అభిమానుల నుంచి తామర తంపరగా వస్తున్న విజ్ఞాపనలను చూసి తుసాడ్స్ మేనేజ్‌మెంట్ ఈ నిర్ణయానికి వచ్చిందని సమాచారం. టుపీస్ బికినీలోనూ... లిప్ లాక్ కిస్‌లతోనూ ప్రేక్షకులకు మత్తెక్కించే కరీనాకోసం అభిమానులు ఈ మాత్రం డిమాండ్ చేయడం న్యాయమే అనిపిస్తుంది.
మైనపు విగ్రహాలు కలిగిన భారత ప్రముఖుల సరసన తాజాగా కరీనా కపూర్ చేరిపోయారు. కరీనా మైనం విగ్రహాన్ని లండన్ లోని ప్రఖ్యాత మడమే తుస్సుద్ మ్యూజియం లో ప్రదర్శన కు ఉంచారు . దీంతో ఈ తరహ విగ్రహాలు కలిగిన హృతిక్ రోషన్, ఐశ్వర్య రాయ్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్ మరియు సచిన్ టెండూల్కర్ తోపాటు కరీనా కూడా జతకట్టారు. 'జబ్ వుయ్ మెట్" చిత్రం లో సూపర్ హిట్ సాంగ్ 'మౌజ హై మౌజ", స్తిల్ల్స్ ఆధారంగా ఈ విగ్రహాన్ని రూపొందించారు. నలుగు నెలల పాటు శ్రమించి, £ 150,000 ఖర్చు తో ఈ విగ్రహాన్ని తాయారు చేసారు. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ నా స్టాచ్యూని చూసి నేనే స్టన్ అయినాను. చాలా అందంగా చేశారు, చేతివేళ్లు, ముక్కు, మొహం, బాడీ స్ట్రక్చర్ చాలా అందంగా తీర్చి దిద్దారన్నారు. ఇది నేను నమ్మలేకపోతున్నాను. ఇది నాకంటే చాలా అందగా ఉంది అన్నారు.


Click it and Unblock the Notifications











