10 డేస్ కలెక్షన్స్, భార్యకు భాగమన్న సురేందర్ రెడ్డి!
హైదరాబాద్: సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన 'రేసు గుర్రం' చిత్రం ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. ఈ విజయంలో తన భార్య దీపా రెడ్డికి భాగముందని, ఆమె సపోర్టు ఉండటం వల్లనే నేను ఈ విజయం సాధించ గలిగాను అని తెలిపారు.
'దాదాపు రెండు సంవత్సరాల నుండి ఈ సినిమాపై పని చేస్తున్నాను. సినిమా పనిలో పడి చాలా సార్లు ఇంటికి లేటుగా వెళ్లే వాడిని, ఒక్కోసారి అసలు వెళ్లక పోయేవాడిని. అయినా నా భార్య నన్ను ఏమీ అనేది కాదు. ఆమె నన్ను అర్థం చేసుకుని మసులుకోవడం వల్లనే నేను సినిమాపై ఎలాంటి డిస్ట్రబెన్స్ లేకుండా దృష్టి కేంద్రీకరించగలిగాను' అని సురేందర్ రెడ్డి తెలిపారు.

'రేసు గుర్రం' చిత్రం 10 రోజుల కలెక్షన్ వివరాలు
అల్లు అర్జున్, శృతి హాసన్ హీరో హీరోయిన్లుగా 'కిక్' శ్యాం, రవి కిషన్ ముఖ్య పాత్రల్లో నటించిన 'రేసు గుర్రం' చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోంది. తాజాగా 10 రోజులు పూర్తి చేసుకున్న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 45 కోట్లు వసూలు చేసింది.
ఈ సినిమాకు విజయం ఏ ఒక్క నటుడి వల్లో, ఏ ఒక్క టెక్నీషియన్ వల్లో రాలేదని, ప్రతి నటుడు, ప్రతి టెక్నీషియన్ కష్టపడి పని చేయడం వల్లనే సినిమా ఇంత పెద్ద విజయం సాధించిందని వ్యాఖ్యానించారు సురేందర్ రెడ్డి. అల్లు అర్జున్, శృతి హాసన్, శ్యాంతో పాటు అందరూ కష్టపడితేనే ఈ విజయం దక్కింది. ముఖ్యంగా బ్రహ్మానందం గారికి స్పెషల్ థాంక్స్ చెబుతున్నాను అని సురేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సురేంద్ రెడ్డి-దీపా రెడ్డి
సురేందర్ రెడ్డి, దీపా రెడ్డి వివాహం మార్చి 2010లో హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో జరిగింది. వీరి వివాహ వేడుకకు టాలీవుడ్ సెలబ్రిటీలు చిరంజీవి, రవితేజ, అల్లు అర్జున్, ప్రభాస్, కె రాఘవేంద్రరావు, పూరి జగన్నాథ్, డి సురేష్ బాబు, అల్లు అరవింద్, సురేందర్ రెడ్డి, ఇలియానా, దిల్ రాజు, శ్యాంప్రసాద్ రెడ్డి, బ్రహ్మానందం తదితరులు హాజరయ్యారు.


Click it and Unblock the Notifications











