నా భార్య కూడా జెలసీ ఫీలవుతుంది : రామ్ చరణ్
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో ఎవరితో చాలా క్లోజ్‌గా ఉంటారో తెలుసా..? ఇదే ప్రశ్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రామ్ చరణ్‌కు ఎదురైంది. దానికి చరణ్ చాలా ఆసక్తికరంగా సమాధానం ఇచ్చాడు. ఇంట్లో చరణ్ వాళ్ల అమ్మ సురేఖతోనే చాలా సన్నిహితంగా ఉంటాడట.
చిన్నప్పటి నుంచి నాకు అమ్మ దగ్గరే చనువు ఎక్కువ. అమ్మ నాకు ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటుంది. మా ఇద్దరి ముందు మూడో వ్యక్తి ఎవరున్నా, చివరకు నాన్న ఉన్నా సరే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంది. నన్ను ఏ విషయంలోనూ, ఎప్పుడూ తక్కువ చేసి చూడదు. నాన్నకు ఏ విషయంలో అయినా నాపైం కోపం వస్తే అమ్మ మాత్రమే నాన్నకు సర్ధిచెబుతుంది.
అమ్మను హగ్ చేసుకుని ఉండటం అంటే నాకు ఎంతో ఇష్టం.......ఇది చూసి నా భార్య ఉపాసన కూడా జెలసీ ఫీలవుతుంది. అమ్మ ఒక్క రోజు లేకున్నా ఇంట్లో అంతా అస్తవ్యస్తం అవుతుంది. ఇంటి వ్యవహారాల్లో ఆమె ఎంతో కీలకం అని చెప్పుకొచ్చారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్.
ఉపాసనతో తనకు ఏడేళ్ల క్రితం పరిచయం ఏర్పడిందని, పెళ్లికి ముందు ఓ సంవత్సరం డేటింగ్ చేసాం. మాది ప్రేమ వివాహం. ఓ స్పోర్ట్స్ క్లబ్‌లో కలిసాం. అప్పటికి ఒకరి గురించి ఒకరికి సరిగ్గా తెలియదు. ఆ తర్వాత స్నేహం ఏర్పడింది. అప్పడు కుక్క, పిల్లి లాగా పోట్లాడుకునే వాళ్లం. చట్నీ, సాస్ మీద పోసుకునే వాళ్లం. అలా ఇద్దరి మధ్య ప్రేమ పుట్టిందని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












