»   » భార్యతో మంచు మనోజ్ ఇబ్బందులు, ఫ్యాన్స్ కు సారీ...!

భార్యతో మంచు మనోజ్ ఇబ్బందులు, ఫ్యాన్స్ కు సారీ...!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మంచు మనోజ్ వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. తన స్నేహితురాలు ప్రణతి రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఈ యంగ్ హీరో. అయితే పెళ్లయిన తర్వాత భార్యతో ఆయనకు కొన్ని ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా అభిమానులతో సరిగా ఇంటరాక్ట్ కాలేక పోతున్నాడు. ఈ విషయాలు చెప్పింది మరెవరో కాదు.... ఆయనే.

పెళ్లి ముందు మంచు మనోజ్ ఫేస్ బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో ఎప్పుడూ అభిమానులకు అందుబాటులో ఉండేవాడు. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అందులో పోస్టు చేసే వాడు. కానీ పెళ్లయిన తర్వాత ఆయన భార్య ప్రణతి మనోజ్ ను అసలు ఫోన్ దగ్గరకే వెళ్లనివ్వడం లేదట. ఫేస్ బుక్, ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండనందుకు అభిమానులకు సారీ చెబుతూ ఓ పోస్టు చేసాడు.

Hi all :) sorry for not being active on Twitter or Fb 󾍛... My wife is not allowing me near my phone 󾍔 lol. Just till...

Posted by Manchu Manoj on Thursday, June 18, 2015

ప్రస్తుతం మంచు మనోజ్ వివిధ దేశాలు తిరుగుతూ భార్య ప్రణతి రెడ్డితో చాలా సంతోషంగా గడుపుతున్నాడు. రేపు అమెరికాలోని లాస్ వెగాస్ వెలుతున్నాడు.

అతని సినిమాల విషయానికొస్తే.... మంచు మనోజ్ నటించిన ‘ఎటాక్' చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఆయన జి.ఈశ్వర్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇటీవలే ఈ చిత్రం ప్రారంభోత్సవం జరుపుకుంది. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

English summary
"Hi all sorry for not being active on Twitter or Fb. My wife is not allowing me near my phone. Just till this trip though:) well Going to vegas tomorrow with my friends I would love to meet our Telugu ppl in vegas Lemme know" Manchu Manoj said.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu