‘బతుకు జట్కాబండి’ సుమలతకు రెబల్‌స్టార్ భర్తే అడ్డు?
రోజా, వాణి విశ్వనాథ్ తరహాలో నిన్నటి తరం హీరోయిన్ సుమలత కూడా రాజకీయాల్లోకి వస్తుందని అంతా ఊహించారు. కన్నడ నటుడు అంబరీష్‌ను పెళ్లాడిన ఆమె కన్నడ రాజకీయాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని కొన్ని రోజులుగా కర్నాటక మీడియాలో ప్రచారం జరుగుతోంది.
ప్రస్తుతం అంబరీష్ కాంగ్రెస్ పార్టీ తరుపున కర్నాటకలో ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయతో పాటు వచ్చే ఎన్నికల్లో భార్య సుమలత కూడా పోటీ చేస్తుందనే ప్రచారం కొన్ని రోజులగా జరుగుతోంది. అయితే అలా జరిగే అవకాశం లేదని తాజాగా అంబరీష్ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది.

భర్తే అడ్డుగా ఉన్నారా?
అయితే సుమలత రాజకీయ అరంగ్రేటానికి ఆమె భర్త అంబరీష్ అడ్డుగా ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ అంబరీష్ చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు బలాన్ని ఇస్తున్నాయి.

తన భార్యా బిడ్డలు రాజకీయాల్లోకి రారని తేల్చి చెప్పిన అంబరీష్
‘రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హైకమాండ్ మరోసారి టికెట్ ఇస్తే పోటీచేస్తా, అంతేకానీ నేను కాకుండా నా భార్యకానీ, కుమారుడు కానీ ఎన్నికల్లో పోటీ చేయరు' అని ఎమ్మెల్యే, శాండల్‌వుడ్ రెబల్‌స్టార్ అంబరీష్ స్పష్టం చేశారు.

అంబరీష్ మీద అనేక రూమర్లు
కాగా...అంబరీష్ మీద కర్నాటకలో అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అతడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ వచ్చే ఎన్నికల నాటికి పార్టీ మారే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.

రాజకీయాలపై ఆసక్తిగా ఉన్న సుమలత
సినిమా నటిగా కెరీర్ ప్రారంభించిన సుమలత సౌత్ లో అన్ని భాషల్లో నటించింది. కన్నడ నటుడు అంబరీష్ ను ప్రేమ వివాహం చేసుకున్నారు. తర్వాత ఆమె తెలుగులో ‘బతుకు జట్కా బండి' లాంటి టీవీ షోలు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లోకి రావాలని ఆసక్తిగా ఉన్నారు. కానీ పరిస్థితులు ఆమెకు అనుకూలించడం లేదు.


Click it and Unblock the Notifications











