For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  ఆ రెండే ముఖ్యం: పుట్టినరోజున RRR గురించి అలియా భట్ హాట్ కామెంట్

  |

  అలియా భట్ హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టి 7 సంవత్సరాలైంది. ప్రముఖ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు కావడంతో పెద్దగా కష్టపడకుండానే అవకాశాలు దక్కించుకున్నప్పటికీ... తన యాక్టింగ్ టాలెంట్, హార్డ్ వర్క్‌తో స్టార్ హీరోయిన్ స్థాయికి ఎదిగింది. ఇండియన్ సినీ పరిశ్రమలో మోస్ట్ డిమాండింగ్ హీరోయిన్లలో ఒకరిగా మారింది. నేడు(మార్చి 15) 26వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్న అలియా... రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టుతో తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. ఈ చిత్రంలో ఆమె రామ్ చరణ్‌కు జోడీగా కనిపించబోతున్నారు.

  నా కోరిక తీరింది

  నా కోరిక తీరింది

  బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడంపై అలియా భట్ చాలా ఎగ్జైట్మెంటుతో ఉన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ‘ఆర్ఆర్ఆర్' ప్రాజెక్టులో భాగం కావడం ఎంతో గొప్పగాభావిస్తున్నట్లు తెలిపారు. రాజమౌళి సర్‌తో పని చేసే అవకాశం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. నా కోరిక ఇంత త్వరగా నిజం అవుతుందని ఊహించలేదన్నారు.

  నాకే ఇంకా ఏమీ తెలియదు.. ఏం చెప్పాలి?

  నాకే ఇంకా ఏమీ తెలియదు.. ఏం చెప్పాలి?

  ‘ఆర్ఆర్ఆర్' సినిమా గురించి తాను ఇప్పుడే ఏ విషయాలు చెప్పలేనని, ఎందుకంటే తనకు కూడా ఇంకా ఏ విషయాలు తెలియదని అలియా భట్ చెప్పుకొచ్చారు. తొలిసారి సౌతిండియా సినిమాలో చేయబోతుండటం ఎగ్జైటింగ్‌గా ఉందని తెలిపారు.

  ఆ రెండు అంశాలు ముఖ్యం

  ఆ రెండు అంశాలు ముఖ్యం

  అలియా భట్ నటిస్తున్న ‘కలంక్' టీజర్ విడుదలై అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. దీని తర్వాత తన తన ప్రియుడు రణబీర్ కపూర్‌తో కలిసి ‘బ్రహ్మాస్త్ర'లో కనిపించబోతోంది. ఆ వెంటనే ‘ఆర్ఆర్ఆర్' ఆఫర్ కొట్టేసింది. అయితే చిన్నసినిమా, పెద్ద సినిమా అనే తేడా నేను చూడను, నాకు సినిమాలో నేను చేస్తున్న క్యారెక్టర్, దర్శకుడు ముఖ్యం. ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకుని సినిమాల సెలక్షన్ చేసుకుంటానని అలియా భట్ తెలిపారు.

  అలియా భట్

  అలియా భట్

  మార్చి 15,1993లో జన్మించిన అలియా భట్.. 2012లో వచ్చిన ‘స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' ద్వారా 19 ఏళ్ల వయసులో హీరోయిన్‌గా కెరీర్ మొదలు పెట్టింది. తొలి చిత్రంతోనే ఫిల్మ్ ఫేర్ బెస్ట్ డెబ్యూ అవార్డు గెలుచుకుంది. హైవే, 2 స్టేట్స్, ఉడ్తా పంజాబ్ చిత్రాల్లో తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘రాజీ' చిత్రం అలియా కెరీర్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. ప్రస్తుతం కలంక్, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, బ్రహ్మాస్త్ర, ఆర్ఆర్ఆర్ చిత్రాల్లో నటిస్తోంది.

  English summary
  "Now, I am doing the preparation for it. I can't reveal details of the film because I don't know whether I am supposed to talk about the film, but... I am feeling really grateful as I wished in my heart that I wanted to work Rajamouli sir and that wish has been fulfilled now, so I feel immense gratitude. It's my first time to work in the South Indian film industry, so I am really excited," Alia Bhatt, who turned 26 on March 15, said on being asked about being a part of RRR.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more