త్రీ ఇడియట్స్ డైరక్టర్ కి పార్సిల్ షాక్
త్రీ ఇడియట్స్ చిత్ర దర్శకుడు రాజకుమార్ హిర్వాణికి ఈ మధ్యన ఆస్ట్రేలియా నుంచి ఓ మిస్టీరియస్ పార్సిల్ వచ్చింది. అయితే ఆ పార్శిల్ లో ఉన్న మ్యాటర్ కన్నా ఆ పార్శిల్ చేరిన విధానం ఆయన్ని ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే ఆ పార్శిల్ పై ఎడ్రస్ ఈ విధంగా ఉంది...రాజ్ కుమార్ హిర్వాణి, డైరక్టర్ ఆఫ్ త్రీ ఇడియట్స్ అండ్ మున్నాభాయ్, సాంత్రాకజ్, ముంబై అని ఉంది. అయితే పోస్టల్ వాళ్ళు దాన్ని వెనక్కి తిరిగి పంపేయకుండా రెండు వారాల తర్వాత హిర్వాణికి ఆ పార్శిల్ ని అందచేసారు. ఈ విషయమై ఆ దర్శకుడు మాట్లాడుతూ.. నేను ఈ ఎపిసోడ్ మొత్తం విని స్టన్ అయ్యాను. నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగానే ఉంది. ఎడ్రస్ లేకుండా అమితాబ్,అమీర్ ఖాన్ లాంటి వారికి ఉత్తరాలు చేరాయంటే నమ్ముతాను కానీ, నాకు కూడా ఇలా పార్శిల్ సేఫ్ గా చేరటం అనేది నమ్మలేని విషయం. దీనికి నేను పోస్టర్ శాఖ వారిని అభినందిస్తున్నాను. అయినా వాళ్ళు తలుచుకుంటే దీన్ని వెనక్కి పంపేయటం క్షణాల పని, అది చేయలేదు అన్నారు. ఇక ఆ పార్శిల్ పంపింది.. కాంత్రి హిర్వాణి. ఆయన ఆ పార్శిల్ లోపల ఓ సీడిని పెట్టి పంపారు. రాజ్ కుమార్ హిర్వాణికీ తమకూ ఉన్న రిలేషన్ షిప్ ను గుర్తు చేస్తూ ఆ సిడీలో ఫోటోలు పంపారు. అదీ సంగతి.


Click it and Unblock the Notifications











