ఉదయ్ కిరణ్ ఆత్మహత్య: ఏది నిజం? ...ఏది అబద్దం??

By Srikanya

హైదరాబాద్ : 'చిత్రం' హీరో ఉదయ్‌కిరణ్‌ మరణం సినీ పరిశ్రమకూ, అభిమానులకూ అంతులేని విషాదాన్ని మిగిల్చింది. ఆయన ఉరేసుకుని చనిపోయాడన్న విషయాన్ని కుటుంబసభ్యులు, భార్య విషిత ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ ఆత్మహత్యకు కారణాలేంటి... అసలు ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్దితులేంటి...కేవలం అవకాశాలు లేక,ఆర్ధిక ఇబ్బందులేనా...మరేదన్నా ఉన్నాయా... ఇలా ఎన్నో ప్రశ్నలు అభిమానులకు కలుగుతున్నాయి.

సినిమాల్లో ఆఫర్స్ లేక ..ఆర్దిక ఇబ్బందులు చుట్టముట్టడంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆదివారం రాత్రి వరకూ పోలీసులు కూడా భావించారు. అయితే ఆత్మహత్య చేసుకోవాల్సినంత స్ధాయిలో ఆర్దిక ఇబ్బందులు లేవని దర్యాప్తులో తేలింది. ఉదయ్ కిరణ్ కు నగర శివార్లులో రెండు మూడు స్ధలాలు ఉన్నట్లు గుర్తించామని డీసిపి తెలిపారు.

దానికి తోడు ఆత్మహత్య చేసుకునేందుకు కారణాలను పరిశీలిస్తే గతంలోనూ ఆత్మహత్యాయత్నం చేశారని పోస్టుమార్టం నివేదిక ద్వారా వెల్లడైంది. అప్పుడు ఎందుకు ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకున్నారు. మరో ప్రక్క ఆయన సన్నిహితులు,తండ్రి ఉదయ్ కిరణ్ అంత పిరికివాడు కాదు...ఆర్దికంగా అంత చితికిపోలేదు..ఆస్ధులున్నాయి అంటున్నారు . ఏ కారణాలు అతన్ని అటు వైపుగా నడిపించాయి. మరో ప్రక్క ఏడాది క్రితమే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు...అలాంటి వాడు ఎందుకు ఇంత తొందరపాటు నిర్ణయానికి ప్రయత్నించాడు.

స్లైడ్ షోలో ... మిగతా వివరాలు

ఆర్దిక కారణాలా..

ఆర్దిక కారణాలా..

ఒకప్పుడు అంటే వెలిగిన రోజుల్లో బెంజి కారుని వినియోగించినా ప్రస్తుతం సాధారణ కారుకే పరిమితమయ్యాడు. ఇన్ని ఎక్సపీరియన్స్ లు,ఎత్తు పల్లాలు చూసిన ఉదయ్ జీవితంలో రాటు తేలే ఉంటాడని, ఉన్నట్టుంది ఇలా ఆత్మహత్య చేసుకోడని అంటున్నారు పోలీసులు.

అయితే

అయితే

చిన్న, చిన్న విషయాలకే భావోద్వేగాలకు లోనయ్యేవారని తల్లి మరణం తర్వాత ఒంటరితనంతో ఇబ్బంది పడి ఉంటారని వారు అభిప్రాయపడ్డారు. సినీ, వ్యక్తిగత జీవితంలో తగిలిన దెబ్బల కారణంగా నియంత్రణ కోల్పోయే అవకాశాలు ఉన్నాయని వివరించారు.

పోస్ట్ మార్టం నివేదిక...

పోస్ట్ మార్టం నివేదిక...

ఈ నివేదకను అధికారికంగా ఉస్మానియా వైద్య నిపుణులు ఇంకా పోలీసులకు పంపలేదు. శవపరీక్ష నిర్వహించిన వైద్య నిపుణుల ద్వారా ఉదయ్‌కిరణ్‌కు సంబంధించిన విషయాలు తెలిశాయి. గతంలో ఒకటి, రెండుసార్లు ఆత్మహత్యాయత్నాలు చేసినట్టు ఎడమచేతి మణికట్టు దగ్గర కత్తిగాట్లున్నాయని, ఆ గాయాలు మానిపోయాయని మీడియాకు చెప్పారు. వీటి ఆధారంగా ఎప్పుడు ఆత్మహత్యయత్నాలకు పాల్పడ్డారో చెప్పడం కష్టమని వివరించారు.

పెళ్లయ్యాక..

పెళ్లయ్యాక..


మరోవైపు పెళ్లయ్యాక చాలా సంతోషంగా ఉన్నారని, భార్య పేరును కుడి చేయి మణికట్టుపై పచ్చబొట్టు పొడిపించుకున్నారని ఉదయ్‌కిరణ్‌ సన్నిహితులు తెలిపారు.

ఎస్సెమ్మెస్ లేదూ..మరొకటి లేదు

ఎస్సెమ్మెస్ లేదూ..మరొకటి లేదు

ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 10 గంటల వరకూ ఉదయ్‌కిరణ్‌ ఫోన్‌ నుంచి నాలుగు కాల్స్‌ మాత్రమే వెళ్లాయని చెప్పారు. విషిత స్నేహితుడు శరత్‌కు రెండుసార్లు, మరో రెండుసార్లు విషితకు ఫోన్‌ చేసినట్లు గుర్తించామన్నారు. 'ఐ లవ్‌ యూ..' అన్న సంక్షిప్త సందేశంతో తాను కంగారుపడి ఇంటికి వచ్చానంటూ ఉదయ్‌కిరణ్‌ భార్య చెప్పారని అయితే.. అతని సెల్‌ఫోన్‌ నుంచి సంక్షిప్త సందేశం వెళ్లలేదన్నారు. ఆమె ఎందుకలా చెప్పారో తెలుసుకుంటామన్నారు.

విషిత స్నేహితుడుతో..

విషిత స్నేహితుడుతో..

ఉదయ్ కిరణ్ ..మరణానికి ముందు తన భార్య స్నేహితుడు శరత్ కు నాలుగు కాల్స్ ఉన్నాయి. శరత్ ని ప్రశ్నిస్తే...కేవలం బర్త్ డే పార్టీకి వస్తావా..రావా...అనేదానిపైనే తాము మాట్లాడుకున్నట్లు అతను చెప్పాడని పోలీసులు తెలిపారు. రోహిత్ పుట్టిన రోజు వేడుకలకు శరత్ కారులోనే విషిత వెళ్లినట్లు ధర్యాప్తులో తేలింది.

భార్య దూరమవుతోందనేనా...

భార్య దూరమవుతోందనేనా...

డిసిపీ మాట్లాడుతూ... ఇప్పటివరకూ వెలుగులోకి వచ్చిన వివరాలను బట్టి భార్య ఎక్కువ సమయం ఆపీసులో ఉండిపోవటం, తనకు దూరమవుతోందని భావించటం, ఆర్దిక ఇబ్బందులకు,సినీ రంగంలో సన్నిహితులే అవహేళన చేయటం,ఇవన్నీ ఆత్మహత్యకు కారణాలుగా ప్రధామికంగా భావిస్తున్నాం అన్నారు.

రాత్రి 9-10 గంటల మధ్య మరణం..

రాత్రి 9-10 గంటల మధ్య మరణం..

ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్య చేసుకున్న సమయాన్ని ఆయన మృతదేహం ఆధారంగా హైదరాబాద్‌ క్లూస్‌ టీం నిపుణులు గుర్తించారు. రిగర్‌మార్టిస్‌(ప్రాణం పోయాక శరీర భాగాలు బిగుసుకుపోయే సమయం ప్రారంభం) మొదలైన సమయాన్ని పరిగణనలోకి తీసుకుని సమయాన్ని విశ్లేషించారు. క్లూస్‌టీం సభ్యులు మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించగా గొంతుచుట్టూ తాడుతో బిగిసినట్టు చారలు కనిపించాయి. శరీర భాగాలపై ఎక్కడా గాయాలు కనిపించలేదు. రక్తం గడ్డకట్టిన ఆనవాళ్లూ లేవు.

ఫోన్‌కాల్స్‌.. ప్రత్యేక బృందాలు..

ఫోన్‌కాల్స్‌.. ప్రత్యేక బృందాలు..

ఉదయ్‌కిరణ్‌ ఆత్మహత్యకు ముందు ఏ జరిగిందనే అంశాలపై ప్రత్యేకంగా దర్యాప్తు చేసేందుకు రెండు బృందాలు ఏర్పాటుచేసినట్లు పశ్చిమ మండలం డీసీపీ సత్యనారాయణ తెలిపారు.

ఎందుకు వెళ్లింది

ఎందుకు వెళ్లింది

కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో ఉన్నా ఉదయ్‌కిరణ్‌ భార్య ఆదివారం పుట్టినరోజు వేడుకకు వెళ్లిన కారణంపై ఆమెను ప్రశ్నిస్తామన్నారు.

ఎందుకు వెళ్లింది

ఎందుకు వెళ్లింది

కొద్ది రోజులుగా మానసిక ఒత్తిడితో ఉన్నా ఉదయ్‌కిరణ్‌ భార్య ఆదివారం పుట్టినరోజు వేడుకకు వెళ్లిన కారణంపై ఆమెను ప్రశ్నిస్తామన్నారు.

బ్రేక్ ఫాస్ట్ వద్ద తగాదా

బ్రేక్ ఫాస్ట్ వద్ద తగాదా

ఆదివారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ విషయంలో భార్యాభర్తల మధ్య తగాదా జరిగిందని తెలిసింది. ఆ రోజు ఆమె నిద్రలేవటం ఆలస్యం కావటంతో తనను సరిగ్గా పట్టించుకోవటం లేదంటూ గొడవకు దిగినట్లు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X