ఆ న్యూడ్ సీన్ లీక్ వెనక అసలు కారణం అదా? సెన్సార్ ఆఫీసర్ ఫైర్!
బాలీవుడ్లో తెరకెక్కుతున్న ‘అనార్కలి ఆఫ్ ఆరా’ చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో ‘రంఝానా’ ఫేం నటి స్వర భాస్కర్ న్యూడ్ గా నటించింది.
ముంబై: బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'అనార్కలి ఆఫ్ ఆరా' చిత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది. ఈ సినిమాలో 'రంఝానా' ఫేం నటి స్వర భాస్కర్ న్యూడ్ గా నటించింది. ఈ సీన్లు ఇంటర్నెట్లో కూడా లీక్ కావడంతో అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లింది.
మరో వైపు సినిమా సెన్సార్ కు వెళ్లిందని, సెన్సార్ బోర్డ్ ఈ చిత్రానికి 11 కట్స్ ఇచ్చిందని తెలియడంతో న్యూడ్ సీన్లలో నటించిన బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సెన్సార్ బోర్డుపై మండి పడింది. సెన్సార్ బోర్డు వారు ఫిల్మ్ మేకర్స్ క్రియేటివ్ ఫ్రీడమ్ ను హరిస్తున్నారంటూ ఆమె విమర్శలు చేసారు.
చిత్ర యూనిట్ సభ్యులంతా కూడా సెన్సార్ బోర్డ్ అన్ని కట్స్ పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నారు. మరో వైపు సీన్లు లీక్ కావడం సెన్సార్ బోర్డ్ కార్యాలయం నుండే జరిగిందనే అనుమానాలు వ్యక్తం చేసారు.

సెన్సార్ బోర్డ్ చీఫ్ స్పందన
అయితే ఈ లీక్ వ్యవహారం, తమపై వస్తున్న ఆరోపణలపై సెన్సార్ బోర్డ్ చీఫ్ పహ్లాజ్ నిహలానీ స్పందించారు. ‘అనార్కలి ఆఫ్ ఆరా' చిత్రం ఇంకా సెన్సార్ కాలేదు, మేము ఇంకా సినిమా చూడటంగానీ, సర్టిఫైడ్ చేయడం గానీ జరుగలేదు, అలాంటపుడు ముందే 11 కట్స్ ఇచ్చినట్లు చిత్ర యూనిట్ ప్రచారం చేయడం దుర్మార్గమని పేర్కొన్నారు.

పబ్లిసిటీ గిమ్మిక్స్
ఇది ‘అనార్కలి ఆఫ్ ఆరా' చిత్ర యూనిట్ సభ్యులు చేస్తున్న పబ్లిసిటీ గిమ్మిక్కే అని పహ్లాజ్ నిహలానీ ఆరోపించారు. తక్కువ బడ్జెట్లో సినిమా తీస్తారు, సెన్సార్ బోర్డుపై ఆరోపణలు చేస్తూ మీడియా కవరేజీ కోసం ఇలాంటివి చేస్తుంటారని పహ్లాజ్ నిహలానీ మండి పడ్డారు.

లీక్ చేసింది వారేనా?
పహ్లాజ్ నిహలానీ ఈ వ్యవహారంపై స్పందించడంతో లీక్ చేసింది చిత్ర యూనిట్ సభ్యులే అని అనుమానిస్తున్నారు. వారే సీన్లు లీక్ చేసి, పబ్లిసిటీ కోసమే ఇలాంటి చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
అనార్కలి ఆఫ్ ఆరా
అనార్కలి ఆఫ్ ఆరా సినిమా వివరాల్లోకి వెళితే ఈ చిత్రానికి అవినాష్ దాస్ దర్శకత్వం వహించారు. ప్రియా, సందీప్ కపూర్ ఈచిత్రాన్ని నిర్మించారు. మార్చి 24న సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











