పౌరాణికాలు చేసేంత పరిపక్వత నాలో లేదు: జూ ఎన్టీఆర్
తాజాగా విడుదలైన ఊసరవెల్లి ప్రోమోతోపాటు వేసవిలో విడుదలకు తయారవుతన్న 'దమ్ము" కి తయారవుతున్న జూ ఎన్టీఆర్ పౌరాణిక చిత్రాల్లో నటించటానికి ఎప్పుడూ సై అంటారా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే 'యమదొంగ"లో పౌరాణిక పాత్రలు కూడా చెయ్యగలరనే ప్రగాఢవిశ్వాసం అందిరిలో కలిగినా, అప్పుడే కాదు అంటున్నారు జూ ఎన్టీఆర్.
'దాన వీర శూర కర్ణ" ఎన్టీఆర్ తప్పక చెయ్యాలనుకునే చిత్రమే కానీ, ఇంకా టైముంది, నాకింకా నటనలో పరిపక్వత రావాలి అని అనటం ఎన్టీఆర్ నిరాడంబరత, సౌశీల్యతలను వెల్లడిచేస్తోంది. బాబాయి బాలకృష్ణ ఇన్నాళ్ళకు 'శ్రీరామ రాజ్యం"లో పూర్తి నిడివి పౌరాణిక పాత్రలో నటించారనీ, మరో 10సంవత్సరాలు పోతే కానీ తనకూ ఆ సామర్థ్యం రాదని తారక్ అంటున్నారు.
అసలు ఇంకా పెద్ద కారణం ఏమిటంటే 2012వకు ఎన్టీఆర్ కి ఖాళీ లేదు. 'దమ్ము" తర్వాత శ్రీను వైట్లతో ఒక చిత్రం, పూరీ జగన్నాథ్ తో ఒక చిత్రం ఉన్నాయి. ఇలా కమర్షియల్ చిత్రాలతో బిజీగా ఉన్న తరుణంలో ప్రయోగాత్మకంగా పౌరాణికం వైపు దృష్టి పెట్టటం వ్యాపార రిత్యా కూడా సరైన ఆలోచన కాదేమో.......


Click it and Unblock the Notifications











