Just In
- 4 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 5 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 5 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 5 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
వారం మొత్తం రచ్చే.. ‘పుష్ప’పై మైత్రీ ట్వీట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ
టాలీవుడ్ స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప సినిమాపై ఎంతటి అంచనాలున్నాయో అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ బర్త్ డే (ఏప్రిల్ 8) సందర్భంగా ఏదైనా అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తూ వచ్చారు. ఎలాంటి అప్డేట్లు ఇవ్వకపోవడంతో మైత్రీ మూవీస్ మీద అభిమానులు ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మైత్రీని దారుణంగా ఏకిపారేశారు. అయితే ఇప్పుడు మైత్రి ఇచ్చిన అప్డేట్ చూసి అందరూ షాక్ తిన్నారు.

ట్రోల్స్‌తో రచ్చ..
పుష్ప సినిమాకు సంబంధించిన అప్టేట్లు ఆలస్యంగా వస్తున్నాయి.. ఏమీ అంతగా ప్రమోట్ చేయలేదని మైత్రీ మీద బన్నీ అభిమానులు గుర్రుగా ఉన్నారు. నిద్రలేవండి.. కాస్త అప్డేట్లు ఇవ్వండి అని మైత్రిని ఫ్యాన్స్ ఏకిపారేశారు. ఇలా బూతులు తిడుతూ ట్రోల్ చేసే నెటిజన్లకు మైత్రీ వార్నింగ్ కూడా ఇచ్చింది.

రూమర్స్ అలా..
అయితే గత రెండు మూడు రోజుల నుంచి ఓ రూమర్ చక్కర్లు కొడుతూ వచ్చింది. గతేడాది బన్నీ బర్త్ డేకు టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ వదిలిన టీం ఇప్పుడు అదిరిపోయే టీజర్‌ను రెడీ చేసిందని సమాచారం. ఈ మేరకు అదిరిపోయే ప్లాన్లు చేశారని వారం మొత్తం పండుగల ఉండబోతోందనే టాక్ వచ్చింది.

టీజర్‌తో భారీ ప్లాన్..
కేజీయఫ్ చాప్టర్ 2లో ఒక్క డైలాగ్ లేకపోవడంతో మంచి ప్లాన్ చేశారు. అలా భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల ప్రేక్షకులు ఆదరించారు. అలాగే ఇప్పుడు పుష్పకు కూడా మంచి ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. కేవలం హీరోయిజాన్ని ఎలివేట్ చేసే సీన్లతో టీజర్‌ను నింపేందుకు ట్రై చేస్తున్నారట.

మైత్రీ అప్డేట్..
తాజాగా మైత్రీ మూవీస్ ఓ అప్డేట్ ఇచ్చింది. ఈ వారం మొత్తం రచ్చే అన్నట్టుగా ఓ ట్వీట్ వేసింది. అదిరిపోయే రోజులు ముందున్నాయ్.. లోడ్ దింపుతాం అన్నట్టుగా ఓ పోస్టర్‌ను వదిలారు. పుష్ప టీజర్ మాత్రం ఓ రేంజ్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. ప్రీ లోడ్ అంటూ రేపు ఉదయం 11 గంటలకు అదిరిపోయే అప్డేట్ ఇవ్వబోతోన్నట్టు ప్రకటించారు.