పాన్ ఇండియా దర్శకుడితో తారక్ సినిమా ఫిక్స్ .. ఇదిగో సాక్ష్యం!

నందమూరి స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ మొదటిసారి RRR ద్వారా పాన్ ఇండియా సినిమాతో సౌత్ నార్త్ లో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఆ సినిమా కోసం ఆభిమానులు ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. ఇక ఫైనల్ గా మరో పాన్ ఇండియా ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించాలని తారక్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

KGF దర్శకుడితో తారక్ ఒక సినిమా చేయబోతున్నట్లు గత కొన్నాళ్లుగా కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. దాదాపు సినిమా ఫిక్స్ అయ్యిందని అనుకుంటున్న తరుణంలో ఇంకా స్క్రిప్ట్ సిద్ధం కాలేదని టాక్ వచ్చింది. అసలు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అన్న విషయంలో ఇంతవరకు ఎవరు కూడా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ ఇవ్వలేదు. ఇక ఫైనల్ గా బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఒక క్లారిటీ ఇచ్చింది.

Mythri movie makers about jr ntr prashanth neel movie

నేడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు కావడంతో ఒక స్పెషల్ పోస్టర్ ద్వారా అతనికి బర్త్ డే విషెస్ అందించారు. ఒక రేడియేషన్ సూట్ తో తప్పకుండా మిమ్మల్ని కలుస్తామని చెప్పడంతో ప్రశాంత్ తారక్ కోసం హీటెక్కించే స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నట్లు క్లారిటీ వచ్చింది. పైగా మైత్రీ మూవీ మేకర్స్ తో తారక్ ఒక సినిమా చేయడానికి ఎప్పుడో కమిట్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఈ కాంబినేషన్ పై పెద్దగా సందేహించాల్సిన అవసరం లేదు. తప్పకుండా సరికొత్త పాన్ ఇండియా ప్రాజెక్ట్ రానున్నట్లు చెప్పవచ్చు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X