»   » అర్జున్ రెడ్డి ఇక రోడ్డు వేసినట్టే: 50 లక్షల అడ్వాన్స్ తో బుక్ అయ్యాడు

అర్జున్ రెడ్డి ఇక రోడ్డు వేసినట్టే: 50 లక్షల అడ్వాన్స్ తో బుక్ అయ్యాడు

Posted By:
Subscribe to Filmibeat Telugu

సందీప్ రెడ్డి వంగా.... కొన్ని నెలల కిందటి వరకూ ఇండస్ట్రీలో కొందరికి తప్ప పెద్దగా ఎవ్వరికీ తెలియని పేరిది. ఒకే ఒక్క దెబ్బ "అర్జున్ రెడ్డి" రూపం లో అంతే..! ఓవర్ నైట్ లో టాలీవుడ్ ఎల్లలు దాటింది సందీప్ వంగా పేరు. కోలీవుడ్, సాందల్ వుడ్, బాలీవుడ్ వరకూ ఒక్క సారి అన్ని ఇండస్ట్రీల దృష్టీ ఇటు పడింది.

ఇప్పుడు విజయ్ దేవరకొండా, సందీప్ వంగా ఇద్దరూ టాలీవుడ్ లో క్రేజీ ఫెల్లోస్. సక్సెస్ ని ఇంకా... ఆనందిస్తూనే ఉన్న వ్యక్తులు. నిజానికి గతమూడేళ్ళనుంచీ కొత్త దర్శకులకి టాలీవుడ్ లో మంచి డిమాండే ఉన్నా సరైన హిట్ పడకా, మంచి కథ ఉన్నా స్టార్ హీరోల ధాటికి తట్టుకోలేకా పోయారు కొత్త వాళ్ళు. కానీ పెళ్ళి చూపులూ, ఘాజీ, అప్పట్లో ఒకడుండేవాడు లాంటి సినిమాలు హిట్లు కొడుతూ వస్తూండగానే అలాంటి కొత్తవాళ్ళకి ఒక ఇండస్ట్రీ క్రేజీ మూవీ అనదగ్గ స్టఫ్ తో గట్టి ఊపునిచ్చాడు సందీప్ వంగా...

Mythri Movie Makers Advance to Arjun Reddy Director

దీంతో చాలా మంది హీరోలు, నిర్మాత‌లు సందీప్ వెంట ప‌డుతున్నార‌ట‌. సందీప్‌తో సినిమా చేయాల‌ని ఉబ‌లాట‌ప‌డుతున్నార‌ట‌. ఈ నేప‌థ్యంలో 'శ్రీమంతుడు', 'జ‌న‌తాగ్యారేజ్' వంటి సినిమాలు నిర్మించిన 'మైత్రీ మూవీ మేక‌ర్స్' అధినేత‌లు.. సందీప్‌ను సంప్ర‌దించార‌ట‌. త‌మ బ్యాన‌ర్‌లో సినిమా చేసేలా సందీప్‌ను ఒప్పించార‌ట‌.

50 ల‌క్ష‌ల రూపాయ‌లు అడ్వాన్స్ కూడా ఇచ్చార‌ని స‌మాచారం. ఈ సంస్థ ఇప్పుడు రామ్‌చ‌ర‌ణ్‌తో 'రంగ‌స్థలం', నాగ‌చైత‌న్యతో 'స‌వ్య‌సాచి' సినిమాలు నిర్మిస్తోంది. ఈ స‌మ‌యంలోనే సందీప్‌తో మ‌రో సినిమా ప్రారంభించాల‌ని మైత్రీ మూవీ మేక‌ర్స్ అధినేత‌లు భావిస్తున్నారట‌. అయితే ఈ సినిమాలో హీరో ఎవ‌ర‌నేది ఇంకా ఖ‌రార‌వ్వ‌లేద‌ని స‌మాచారం.

English summary
It's going to be a crazy combination for sure. Sandeep Reddy Vanga, who had a sensational start to his career with 'Arjun Reddy', is going to work with Mythri Movies
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu