హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న ఎంఎం కీరవాణి కుమారుడు, ఇతడే...
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కుటుంబం నుంచి ఇప్పటి వరకు వారసులు వచ్చినా వారు కూడా సంగీత ప్రపంచంలోనే తమ టాలెంటును నిరూపించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పటికే కీరవాణి తనయుడు కాలబైరవ సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
అయితే కీరవాణి చిన్న కుమారుడు సింహా కోడూరి సంగీతం వైపు కాకుండా ఇతర డిపార్ట్‌మెంట్స్ వైపు రూటు మార్చాడు. తన తండ్రి పేరు ఏ మాత్రం ఉపయోగించుకోకుండా కేవలం సొంత టాలెంటుతో ఇండస్ట్రీలో ఎదగాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న సింహ... ఇంతకు ముందు సుకుమార్ దగ్గర 'రంగస్థలం' సినిమాకు పని చేశారు.

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మైత్రి మూవీ మేకర్స్ వారు సింహతో సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఒక కొత్త దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించబోతున్నారని, హాఫ్ బీట్ థీమ్‌తో చిన్న బడ్జెట్ చిత్రంగా దీన్ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలుగులో ఇప్పటికే శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, రంగస్థలం లాంటి భారీ కమర్షియల్ సినిమాలను నిర్మించిన 'మైత్రి మూవీ మేకర్స్' వారు కేవలం ఇలాంటి పెద్ద కమర్షియల్ సినిమాలే కాకుండా అన్ని రకాల సినిమాలు తీయాలనే ఆలోచనలో భాగంగా సింహ కోడూరితో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఒక అసాధారణ థీమ్‌తో ఈ మూవీ ఉండబోతోందని, ఇది కమర్షియల్ సినిమా కాక పోయనా.... 'మైత్రి మూవీ మేకర్స్' సంస్థ పేరు నిలబెట్టే విధంగా, విమర్శకుల ప్రశంసలు అందుకునే విధంగా ఉంటుందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











