Salman Khan తో మైత్రీ మూవీ మేకర్స్ పాాన్ ఇండియా మూవీ.. దర్శకుడు ఎవరో తెలుసా?

బాహుబలి RRR సినిమాల తర్వాత టాలీవుడ్ స్థాయి అమాంతంగా పెరిగిపోయింది. మొన్నటి వరకు బాలీవుడ్ హీరోలు టాలీవుడ్ ఇండస్ట్రీని పెద్దగా పట్టించుకునేవారు కాదు. కానీ బాహుబలి వచ్చిన తర్వాత వారి అంచనాలు మొత్తం మారిపోయాయి. అవసరమైతే తెలుగు దర్శకులతో కూడా సినిమాలు చేయాలి అని ఎంతో ఆసక్తిని చూపిస్తున్నారు. ఫైనల్ గా సల్మాన్ ఖాన్ కూడా తెలుగు దర్శకులతో సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల దర్శకుడితో ప్రత్యేకంగా మీటింగ్ కూడా నిర్వహించారు. ఆ వివరాల్లోకి వెళితే..

టాలీవుడ్ డామినేషన్

టాలీవుడ్ డామినేషన్

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీ నుంచి బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు వరుసగా బాలీవుడ్ షాక్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా బాహుబలి సినిమా నుంచి వరుసగా బిగ్ పాన్ ఇండియా సినిమాలు రూపొందుతున్నాయి. ఇక అందులో తెలుగు చిత్రాల డామినేషన్ మరీ ఎక్కువగా పెరిగిపోయింది. పుష్ప, RRR సినిమాలతో ప్రస్తుతం బాలీవుడ్ ప్రముఖుల దృష్టి మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీ పైన పడిపోయింది.

తెలుగులో సల్మాన్ ఖాన్ క్రేజ్

తెలుగులో సల్మాన్ ఖాన్ క్రేజ్

ఒకప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోలు తెలుగు దర్శకులతో సినిమాలు చేయాలి అంటే చాలా ఆలోచించేవారు. కేవలం కథలను మాత్రమే తీసుకొని బాలీవుడ్లో రీమేక్ చేసేవారు. అయితే టాలీవుడ్ కథలతో ఎక్కువగా సక్సెస్ అందుకున్న వారిలో సల్మాన్ ఖాన్ కూడా ఉన్నాడు. 90ల కాలంలో సల్మాన్ ఖాన్ కు సంబంధించిన కొన్ని కుటుంబ కథా చిత్రాలు తెలుగులో కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి.

మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు

మైత్రి మూవీ మేకర్స్ తో చర్చలు

ఇక సల్మాన్ ఖాన్ ప్రస్తుతం తన ఫోకస్ ను టాలీవుడ్ ఇండస్ట్రీ పై పెట్టినట్లుగా తెలుస్తోంది. తెలుగు నిర్మాతలతో దర్శకులతో అతను రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్నాడని కూడా కథనాలు వెలువడుతున్నాయి. రీసెంట్ గా మైత్రి మూవీ మేకర్స్ తో ప్రత్యేకంగా చర్చలు జరపడంతో సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారిపోయింది.

డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా..

డైరెక్టర్ హరీష్ శంకర్ కూడా..

మైత్రి మూవీ మేకర్స్ అధినేతల్లో ఒకరైన నవీన్ గతంలోనే సల్మాన్ ఖాన్ బావా అతుల్ అగ్నిహోత్రిని ప్రత్యేకంగా కలిసి సల్మాన్ ఖాన్ తో ప్రాజెక్టు విషయంపై చర్చలు కూడా జరిపారు. ఇక చాలా రోజుల తర్వాత మళ్లీ ఆ నిర్మాతలు సల్మాన్ ఖాన్ ను కలిసినట్లుగా తెలుస్తోంది. ఇక వీరితో పాటు దర్శకుడు హరీష్ శంకర్ కూడా స్టార్ హీరో ను కలవడం చర్చనీయాంశమైంది.

పవర్ఫుల్ కాంబినేషన్?

పవర్ఫుల్ కాంబినేషన్?

చూస్తుంటే మైత్రి మూవీ మేకర్స్ సల్మాన్ ఖాన్ హరీష్ శంకర్ కాంబినేషన్లో ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా సినిమాలు తెరపైకి తీసుకు వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమా చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు సల్మాన్ ఖాన్ తో ప్రత్యేకంగా చర్చలు జరుపూతూ ఉండడంతో కొత్త ప్రాజెక్ట్ తీసుకువస్తారా లేదా తెలుగులో సక్సెస్ అయిన కథను రీమేక్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X