Mythri Vs PVR మొన్న సలార్.. నేను మంజుమ్మల్ బాయ్స్.. పీవీఆర్‌పై మైత్రీ ఫైర్

దక్షిణాది సినీ పరిశ్రమలో రికార్డు కలెక్షన్లను రాబట్టిన చిత్రం మంజుమ్మల్ Boys. ఇటీవల తెలుగు డబ్బింగ్ చిత్రంగా రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకొంటున్నది. అయితే సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శింపబడుతున్న ఈ సినిమాను పీవీఆర్ యాజమాన్యం ఎత్తివేయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో మైత్రీ మూవీ మేకర్స్ ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో కూడా తెలుగు సినిమాను, అలాగే ప్రభాస్ నటించిన సలార్ సినిమాకు ఇలాంటి చర్యలు చేయడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. తాజా వివాదానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మంజుమ్మల్ Boys సినిమా ఇటీవల 200 కోట్ల రూపాయల మార్కును దాటి విజయవతంగా థియేటర్లలో ప్రదర్శింపబడుతున్నది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తున్నది. అయితే తాజాగా చోటేమియా బడేమియా సినిమా రిలీజ్ కారణంగా ఈ సినిమాను పీవీఆర్ స్క్రీన్ల నుంచి తొలగించింది. దాంతో మైత్రీమూవీ మేకర్స్ ఘాటుగా స్పందించింది.

Mythri Movie Makers Serious on PVR Multiplex over stopping Manjummel Boys from Theates

మంజుమ్మల్ బాయ్స్ సినిమాను థియేటర్ల నుంచి తీసివేయడంపై మైత్రీ మూవీస్ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే మలయాళ సినిమా నిర్మాతతో ఉన్న వివాదం కారణంగానే ఈ చిత్రాన్ని తీసేశామని పీవీఆర్ నిర్వాహకులు చెప్పడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. మలయాళ నిర్మాతతో వివాదం ఉంటే.. తెలుగు వెర్షన్‌ను ఎలా ఎత్తివేస్తారని ప్రశ్నించారు.

మంజుమ్మల్ బాయ్స్ సినిమా తెలుగు రాష్ట్రాల్లో భారీ కలెక్షన్లు సాధిస్తున్నది. అలాంటి సమయంలో అర్ధాంతరంగా సినిమాను ఆపేయడం అన్యాయం. ప్రదర్శనలు ఆపడం వల్ల ఆర్థికంగా నష్టపోతున్నాం అని శశిధర్ రెడ్డి అన్నారు. ఈ వివాదాన్ని తెలుగు ఫిల్మ్ ఛాంబర్ దృష్టికి తీసుకెళ్తామని అన్నారు.

Mythri Movie Makers Serious on PVR Multiplex over stopping Manjummel Boys from Theates

గతంలో షారుక్ ఖాన్ సినిమా డంకీ రిలీజ్ సందర్భంగా తెలుగు చిత్రం సలార్ చిత్రానికి స్క్రీన్లు కేటాయించకపోవడం వివాదంగా మారింది. డంకీ సినిమాకు ఎక్కువ స్క్రీన్లు ఇచ్చి ప్రభాస్ సినిమాకు స్క్రీన్లు కేటాయించకపోవడంపై సినీ వర్గాలు తప్పుపట్టాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X