హృతిక్ రోషన్ తో మైత్రి దర్శకులు.. ఫొటో ద్వారా హింట్ ఇచ్చేసిన నిర్మాత!

ప్రముఖ టాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ రాబోయే రోజుల్లో అతిపెద్ద భారీ బడ్జెట్ సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ఇప్పటికే ఈ సంస్థలో 1000 కోట్లకు పైగా పెట్టుబడితో స్టార్ హీరోల సినిమాలు తెరపైకి రాబోతున్నాయి. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద సినిమాలను మైత్రి మూవీ మేకర్స్ లైన్లోకి తీసుకురాపోతోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలపై కూడా ఈ సంస్థ గట్టిగానే ఫోకస్ చేస్తుంది. రీసెంట్ గా హృతిక్ రోషన్ తో కూడా ఈ సంస్థ ప్రత్యేకంగా చర్చలు జరిపింది. ఇక మరో ఇద్దరు తెలుగుదర్శకులను ఆ హీరో దగ్గరకు అయితే తీసుకువెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. ఆ వివారాల్లోకి వెళితే..

మొదట్లోనే వరుస విజయాలు

మొదట్లోనే వరుస విజయాలు

మొదట ఓవర్సీస్ లో తెలుగు సినిమాలను డిస్ట్రిబ్యూట్ చేస్తూ మంచి లాభాలను అందుకున్న మైత్రి మూవీ మేకర్స్ అనంతరం టాలీవుడ్ ఇండస్ట్రీలోకి శ్రీమంతుడు సినిమా ద్వారా వారి ప్రొడక్షన్ హౌస్ ను స్టార్ట్ చేశారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరిగి చేసుకోకుండా కొరటాల శివతో వరుసగా సినిమాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.

ఆ సినిమా కోసం బిగ్ బడ్జెట్

ఆ సినిమా కోసం బిగ్ బడ్జెట్

ఇక పుష్ప సినిమా తర్వాత ఈ సంస్థ నుంచి మరో లెవల్ కు వెళ్లిపోయింది. సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చిన ఆ సినిమా ఫ్యాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద మైత్రి మూవీ మేకర్స్ కు మంచి గుర్తింపును తీసుకువచ్చింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ ని కూడా అంతకుమించి అనేలా తెరపైకి తీసుకురాబోతున్నారు. ఆ సినిమా కోసం దాదాపు 300 కోట్ల వరకు ఖర్చు చేయబోతున్నారు అని మీడియాలో టాక్ అయితే వినిపిస్తోంది.

బాలీవుడ్ కాంబినేషన్స్

బాలీవుడ్ కాంబినేషన్స్

అయితే కేవలం తెలుగు హీరోలతోనే కాకుండా ఇప్పుడు బాలీవుడ్ కోలీవుడ్ అగ్ర హీరోలతో కూడా సినిమాలు చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ చర్చలు జరుపుతోంది. అంతేకాకుండా బాలీవుడ్ దర్శకులను కూడా లైన్లోకి తీసుకువస్తూ ఉండడం విశేషం. ఇప్పటికే ప్రభాస్ సిద్ధార్థ్ ఆనంద్ కాంబినేషన్లో ఒక మల్టీస్టారర్ సినిమా చేసేందుకు ప్లాన్ మొదలుపెట్టిన విషయం తెలిసిందే.

 హృతిక్ రోషన్ తో చర్చలు

హృతిక్ రోషన్ తో చర్చలు

ఇక మొత్తానికి రీసెంట్ గా కొన్ని రూమర్స్ విషయంలో అయితే మైత్రి మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చింది. సిద్ధార్థ్ ఆనంద్ ను మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ ను కూడా మైత్రి మూవీ మేకర్స్ ప్రత్యేకంగా కలిసింది. ఇక ఆయనతోపాటు వారి వెంట మైత్రి ప్రొడక్షన్స్ లో వర్క్ చేసిన తెలుగు దర్శకులను కూడా తీసుకు వెళుతూ ఉండడం విశేషం.

తెలుగు దర్శలులు, బాలీవుడ్ హీరో

తెలుగు దర్శలులు, బాలీవుడ్ హీరో

ఇటీవల తెలుగు దర్శకులతో మైత్రి మూవీ అధినేత నవీన్ ప్రత్యేకంగా హృతిక్ రోషన్ ను కలిశారు. ఇటీవల వీర సింహారెడ్డి సినిమాతో సక్సెస్ అనుకున్న గోపీచంద్ మలినేనితో పాటు ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్న హరిష్ శంకర్ ఇద్దరు కూడా మైత్రి సంస్థతో కలిసి హృతిక్ రోషన్ కోసం ప్రత్యేకంగా కలిశారు. ఇక వీరి కాంబినేషన్లో ఏదైనా సినిమా సెట్ అవుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి. తప్పకుండా తెలుగు దర్శకులను బాలీవుడ్ హీరోల కాంబినేషన్స్ ను కలిపేందుకు మైత్రి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో క్లారిటీ రావాలి అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X