Just In
- 5 hrs ago
బండ్ల గణేష్‌కు తీవ్ర అస్వస్థత.. ఐసీయూలో చేరిన స్టార్ ప్రొడ్యూసర్
- 6 hrs ago
Vakeel Saab Day 5 collections.. చరిత్ర సృష్టించిన పవన్ కల్యాణ్.. లాక్డౌన్ తర్వాత అరుదైన రికార్డు
- 6 hrs ago
ఏక్ లవ్ యా అంటూ నిర్మాతగా మారిన పూరీ జగన్నాథ్ హీరోయిన్.. సొంత తమ్ముడే హీరోగా
- 6 hrs ago
ఐదు భాషల్లో ఆర్జీవి ‘దెయ్యం’.. ఏప్రిల్ 16న ప్రేక్షకుల ముందుకు.. రిలీజ్ ఎందుకు లేట్ అయిందంటే..
Don't Miss!
- News
గూర్ఖాలూ ఆందోళన వద్దు! మీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం: అమిత్ షా
- Sports
KKR vs MI:గెలిచే మ్యాచ్‌లో ఓడిన కోల్‌కతా.. ముంబై ఇండియన్స్ బోణీ!
- Finance
సెన్సెక్స్ 660 పాయింట్లు జంప్, మార్కెట్ అదరగొట్టడం వెనుక...
- Automobiles
డ్యూయెల్ ఛానెల్ ఏబిఎస్‌తో రానున్న యమహా ఎమ్‌టి-15 బైక్: డీటేల్స్
- Lifestyle
Sun Transit in Aries on 14 April:మేషంలోకి సూర్యుడి సంచారం.. ఈ రాశుల వారికి ప్రత్యేకం...!
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
‘మైత్రి’పై మళ్లీ విరుచుకుపడ్డ నెటిజన్స్.. అదిరిపోయే రియాక్షన్ ఇచ్చిన నిర్మాణ సంస్థ
ఈ మధ్య అభిమానులు మరీ సున్నితంగా తయారవుతున్నారు. తమ అభిమాన హీరోల సినిమా అప్డేట్లు ఆలస్యమైతే చాలు అందరినీ ఏకిపారేస్తున్నారు. దర్శక నిర్మాతలను నిలబెట్టి మరీ కడిగి పారేస్తున్నారు. అలా ఈ మధ్య కొన్ని నిర్మాణ సంస్థలు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో తాజాగా అందరూ కూడా మైత్రీ మూవీస్ మీద పడ్డారు. గత వారమే మైత్రీ మూవీస్ మీద దారుణమైన కామెంట్లు చేశారు. మళ్లీ నిన్న ఓ రేంజ్లో విరుచుకుపడ్డారు.

అప్డేట్లతో రచ్చ..
ప్రస్తుతం రామ్ చరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ సినిమా అప్డేట్లతో సోషల్ మీడియాలో ఊగిపోతోంది. ఈక్రమంలో మెగా ఫ్యామిలీ, మెగా హీరోల హవా ఓ రేంజ్లో ఉంది. అయితే ఈ సందర్బంగా అల్లు అర్జున్ సినిమా అప్డేట్ కూడా కావాలని అభిమానులు నిర్మాణ సంస్థ మీద ఒత్తిడి తెస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు.

మైత్రీ సంస్థ..
ప్రస్తుతం మైత్రీ సంస్థ బిజీగా ఉన్నంతగా మరేతర నిర్మాణ సంస్థలు బిజీగా లేవు. టాలీవుడ్ టాప్ స్టార్లందరితోనూ సినిమాలను ప్లాన్ చేశారు. ఇందులో కొన్ని సెట్స్ మీద ఉండగా.. ఇంకొన్ని సెట్స్ పైకి వెళ్లేందుకు రెడీగా ఉన్నాయి. పుష్ప, సర్కారు వారి పాట చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్నాయి.

అప్డేట్లంటూ రచ్చ..
ఇక పుష్ప, సర్కారు వారి పాట అప్డేట్లు ఇవ్వాలంటూ అభిమానులు తెగ రచ్చ చేస్తున్నారు. ఈక్రమంలో నిన్న ఓ రేంజ్లో ట్వీట్ల వర్షం కురిపించారు. మైత్రీ ఇప్పటికైనా మేలుకో అంటూ హ్యాష్ ట్యాగ్‌తో ట్రెండ్ చేశారు. అలా మేలుకో అని నెటిజన్లు ట్రోల్ చేయడంతో మైత్రీ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది.

మేలుకున్న ఎమోజీ..
WakeUpMythriMovieMakers అంటూ నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్స్ చేశారు. వీటిపై మైత్రీ కూల్‌గా స్పందించింది. నిద్రలేచిన ఎమోజీలను పెట్టేసి కౌంటర్ వేసింది. గత వారంలో అయితే కాస్త ఘాటుగా స్పందించింది. తిడుతూ ట్వీట్లు పెట్టేవారిని బ్లాక్ చేసేస్తామని మైత్రీ కౌంటర్ ఇచ్చింది. కానీ ఈ సారి మాత్రం కూల్‌గా కౌంటర్ వేసింది.