twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    సర్కారు వారి పాట, పుష్ప రెండూ రెండే.. అంచనాలు పెంచేస్తోన్న ‘మైత్రీ’ నిర్మాతలు

    |

    ప్రస్తుతం మైత్రీ మూవీస్ బ్యానర్, నిర్మాతలైన నవీన్ యెర్నేనీ, రవిశంకర్‌లు ఎంత జోరు మీదున్నారో అందరికీ తెలిసిందే. టాలీవుడ్‌లో ఇతర బ్యానర్‌లలో ఎక్కడా కూడా ఈ రేంజ్‌లో ప్లానింగ్ కనిపించడం లేదు. దాదాపు అరడజను చిత్రాలు అవి కూడా రేర్ కాంబోలను ఫిక్స్ చేసుకుని ఉన్నారు. మైత్రీ మూవీస్ నుంచి వస్తుందంటే అది కచ్చితంగా స్టార్ క్యాస్టింగ్‌తో వస్తుందని, బ్లాక్ బస్టర్ హిట్ వస్తుందనే నమ్మకంతోనే అందరూ ఉంటారు.

    ఉప్పెన ప్రమోషన్స్‌లో..

    ఉప్పెన ప్రమోషన్స్‌లో..

    ప్రస్తుతం మైత్రీ మూవీస్, నిర్మాతలు, చిత్రయూనిట్ అంతా కూడా ఉప్పెన సినిమాను ప్రమోట్ చేసే పనిలో పడ్డారు. గత ఐదారు రోజులుగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనవీన్ యెర్నేని, రవి శంకర్‌లు ఓ మీడియాతో ముచ్చటించారు.

    భారీ ప్రాజెక్ట్‌లు..

    భారీ ప్రాజెక్ట్‌లు..

    మైత్రీ మూవీస్‌లో ప్రజంట్ జరుగుతున్న, భవిష్యత్తులో రాబోతోన్న చిత్రాలు, క్రేజీ కాంబోల గురించి ఎన్నో సీక్రెట్స్ బయటపెట్టేశారు. బాలయ్య గోపీచంద్ మలినేని, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్, ప్రభాస్‌తో సినిమా ఉంటుందని ఇలా ఎన్నెన్నో అప్డేట్లు ఇచ్చారు.

    కమర్షియల్ చిత్రాలంటే..

    కమర్షియల్ చిత్రాలంటే..

    నాకు కమర్షియల్ చిత్రాలంటేనే ఎక్కువగా ఇష్టం.. మన హీరోలను అలా చూపిస్తేనే బాగుంటుందని అనుకుంటాను.. పవన్ కళ్యాణ్ హరీష్ శంకర్, చిరంజీవి బాబీ సినిమాలు అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రాలే అని నిర్మాత నవీన్ యెర్నేని చెప్పుకొచ్చాడు.

    పుష్పపై అలా..

    పుష్పపై అలా..

    అయితే పుష్ప చిత్రం మాత్రం వేరే కేటగిరీ, అలాంటి బ్యాక్ డ్రాప్.. దానికి సుకుమార్ లాజిక్కులు, బన్నీ నటన తోడైతే ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. పుష్ప, సర్కారు వారి పాట రెండూ కూడా ఓ రేంజ్‌లోఉంటాయి. ఈ రెండూ చిత్రాలు వేటికవే స్పెషల్ అంటూ నిర్మాత నవీన్ యెర్నేని తెలిపాడు.

     దూకుడు రేంజ్‌లో..

    దూకుడు రేంజ్‌లో..

    సర్కారు వారి పాటలో అన్నీ ఉంటాయి.. మెసెజ్.. కామెడీ.. లవ్ ట్రాక్.. మళ్లీ దూకుడు రేంజ్‌లో ఉంటుంది.. అదిరిపోయే కథ అంటూ నిర్మాత చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ రెండు ప్రాజెక్ట్‌లు దుమ్ములేపబోతోన్నాయని చెప్పకనే చెప్పేశారు.

    English summary
    Mythri Producers about sarkaru vaari paata and pushpa...
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X