twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పాప్ సింగర్‌కి చంద్రబాబు లెటర్.. సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన స్మిత

    |

    పాప్ సింగర్ స్మితకు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశాడు. ఈ లేఖ ద్వారా ఆమె టాలెంట్ ని పొగిడాడు చంద్రబాబు. స్మిత ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఆమె సంగీత ప్రస్థానాన్ని పేర్కొంటూ అభినందనల వర్షం కురిపించాడు చంద్రబాబు.

    ''నటి, గాయని స్మిత తన పాటలతో సంగీత ప్రియులకు ఆహ్లాదం కల్గిస్తున్నందుకు అభినందనలు. తెలుగులో ప్రసిద్ధి చెందిన గాయని, నర్తకిగా గుర్తింపు పొందిన స్మిత వల్లూరుపల్లి తెలుగులో మొట్టమొదటి పాప్ ఆల్బమ్ రూపొందించడం గర్వ కారణం. శ్రోతలను అలరించడానికి వివిధ రూపాల్లో పాటలను వేదికగా చేసుకుని స్మిత సాగిస్తున్న ప్రయాణం అనిర్వచనీయం. కాలానికి అనుగుణంగా పాటల పందిరి నిర్మాణం మరింత జనరంజకం అవుతుందని విశ్వసిస్తున్నాను. ఒక్క తెలుగులోనే కాకుండా సంగీతానికి ఎల్లలు లేవరని తెలుపుతూ 9 భాషల్లో పాటలు పాడిన ఘనత సాధించడం ప్రశంసనీయం. భవిష్యత్తులోనూ స్మిత తన మధుర కంఠంతో ఇలానే అలరిస్తూ ఉండాలని ఆశిస్తున్నాను'' అని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.

    N. Chandrababu Naidu Wrote a Letter to Smita

    అయితే చంద్రబాబు పోస్ట్ చేసిన ఈ లేఖను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న స్మిత.. బాబు అభినందనల పట్ల తన సంతోషాన్ని వెల్లడించింది. 'చంద్రబాబు నాయుడు నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. నా 20 సంవత్సరాల జర్నీని గుర్తు చేస్తూ అభినందించినందుకు కృతజ్ఞురాలిని' అని ట్యాగ్ చేసింది స్మిత.

    తెలుగు పాప్ సింగర్ గా మంచి పాపులారిటీ తెచ్చుకుంది స్మిత. మసక మసక చీకటిలో మల్లెతోట వెనకాల.. అంటూ ఆమె చేసిన రీమిక్స్ సాంగ్ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. 1996లో పాడుతా తీయగా కోసం తొలిసారి మైక్‌ పట్టుకున్న స్మిత.. అప్పటి నుంచి ఇప్పటికీ అదే ఉత్సాహంతో పాడుతూ సంగీత ప్రియులను రంజింపజేస్తోంది. ఆ నాడు 1999లో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన స్మిత.. నేడు 2019తో ఇరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్బంగా సినీ, రాజకీయ ప్రముఖులు ఆమెను అభినందిస్తున్నారు.

    English summary
    Andhra Pradesh Ex cheif minister N. Chandrababu Naidu appreciated singer Smita. He posted a letter to smitha. That letter shares with her happiness by smitha on twitter.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X