అందుకే ఆ సీన్స్ కట్ చేస్తానన్నా ఒప్పుకున్నా...ఎన్.శంకర్
సెన్సార్ బోర్డు సభ్యులు కొన్ని సన్నివేశాలు తొలగించాలని చెప్పారు. అవి ప్రధాన ఇతివృత్తానికి ఇబ్బంది కలిగించవు. అందుకే వాటిని తీసేసేందుకు ఒప్పుకొన్నా. సెన్సార్ నుంచి అనుమతి లభించడం సంతోషాన్ని కలిగిస్తోంది అన్నారు దర్శకుడు ఎన్.శంకర్. 'జై బోలో తెలంగాణా' చిత్రానికి కొన్ని కత్తెర్లు వేసి 'ఎ' సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సందర్బంగా చిత్ర దర్శకనిర్మాత ఎన్.శంకర్ మాట్లాడుతూ ఇలా స్పందించారు. అలాగే ఈ చిత్రాన్ని వచ్చే నెల 4న విడుదల చేయబోతున్నారు. ఈ చిత్రంలో జగపతిబాబు ముఖ్య పాత్ర పోషించారు. తెరాస అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌రావు ఈ చిత్రంలో ఓ పాట రాయడమే కాకుండా అతిథి పాత్రలో కనిపించారు.
ఇక ఈ 'జైభోలో తెలంగాణా' అంటూ తెలంగాణా అమరవీరుల చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు చెబుతున్న చిత్రం డిసెంబర్ 31న విడుదల కావాల్సి వుంది. కానీ షూటింగ్ లేటవటంతో వాయిదా పడింది. అలాగే ఈ సినిమాలో తెలంగాణా వస్తున్నట్లుగా చూపించేప్రయత్నం చేశారు. కానీ మరలా మనస్సు మార్చుకుని త్వరలో వస్తుందనేట్లుగా రీ ష్యూట్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం.అలాగే ఎన్.శంకర్ ఈ చిత్రం గురించి చెబుతూ....తెలంగాణ ఉద్యమంతో పాటు సమైక్యాంధ్ర ఉద్యమాన్నీ మా చిత్రంలో చూపిస్తాం. ఈ ఉద్యమాల్ని నిష్పాక్షికంగా, ఒక జర్నలిస్టిక్ వ్యూతో చూపించబోతున్నాం. కొంతకాలంగా రాష్ట్రంలో జరుగుతున్న సంఘటనలు ఇందులో కనిపిస్తాయి. ఈ చిత్రానికి చక్రి సంగీతాన్ని సమకూరుస్తున్నారు.


Click it and Unblock the Notifications











