'జై బోలో తెలంగాణ'ఎగ్జిక్యూటివ్ నిర్మాత మృతి
ప్రముఖ దర్శకుడు ఎన్.శంకర్ సోదరుడు ఎన్.శ్రీనివాస్(38)మృతి చెందారు. శ్రీనివాస్ గత పదిహేను సంవత్సరాలుగా తెలుగు సిని పరిశ్రమలో ప్రొడక్షన్ మేనేజర్ గా,ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నారు. శంకర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన జై బోలో తెలంగాణ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా శ్రీనివాస్ వ్యవహరించారు. సోమవారం ఆయన పెద కర్మ హైదరాబాద్ లో జరగనుంది. శ్రీనివాస్ మృతి పట్ల రాజకీయ నాయకులు,సినీ ప్రముఖలు సంతాపం వెళ్లబుచ్చారు. 14 రీళ్ళ నిడివిగల 'జై బోలో తెలంగాణ' చిత్రం 4-2-2011న విడుదల అయింది. ఈ చిత్రాన్ని మహలక్ష్మి ఆర్ట్ పతాకాన ఎన్. శంకర్ నిర్మించారు. సందీప్ మీరానందన్, జగపతిబాబు, స్మృతి ఇరాని, నాగినీడు ముఖ్యపాత్రలు పోషించారు. సంగీతం చక్రి, సినిమాటోగ్రఫీ సురేందర్‌రెడ్డి నిర్వహించిన ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ఎన్. శంకర్.


Click it and Unblock the Notifications











