కోదండరామ్, చుక్కా రామయ్య సీన్స్ హైలెట్ గా నిలుస్తాయి
ఎన్ కౌంటర్, జయం మనదేరా, భద్రాచలం వంటి హిటి చిత్రాల దర్శకుడు ఎన్.శంకర్ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'జై బోలో తెలంగాణా' షూటింగ్ పూర్తి కావొచ్చింది. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. ఈ చిత్రం పాటల్ని త్వరలోనే విడుదల చేసి జనవరి 7న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకనిర్మాత శంకర్ మాట్లాడుతూ ...నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే కథ ఇది. ప్రతి పాత్ర ఉద్యమ స్ఫూర్తిని నింపుతుంది. పతాక సన్నివేశాలను ఇటీవలే భారీస్థాయిలో తెరకెక్కించాం. కోదండరామ్, చుక్కా రామయ్య, మీరానందన్ తదితరులపై చిత్రించిన ఆ సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయన్నారు.
అలాగే 'జై బోలో తెలంగాణ' చిత్రం విడుదల కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ సినిమాను తెరకెక్కిస్తున్నాం. దీన్ని ప్రత్యేకంగా పరిగణించి చిత్రీకరణ చేసుకొనేందుకు అనుమతి ఇవ్వాల న్నారు దర్శకుడు ఎన్.శంకర్. కార్మికుల్లో ఒక వ్యక్తిగానే అడుగుతున్నా. బంద్‌తో నిమిత్తం లేకుండా సినిమా షూటింగ్ కు, నిర్మాణానంతర పనులకు అనుమతి ఇవ్వాలని నిర్మాతల మండలి, చిత్ర పరిశ్రమ ఉద్యోగుల సమాఖ్య, వాణిజ్య మండలికి వినతి పత్రాలు కూడా పంపామన్నారు.


Click it and Unblock the Notifications











