నందమూరి ఫ్యాన్స్‌కి సర్‌ప్రైజ్.. ఎన్టీఆర్ పూర్తిగా మారిపోయాడు.. యంగ్ టైగర్ షాకింగ్ లుక్!

నందమూరి వారసుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లేటెస్ట్ లుక్ నెట్టింట సెన్సేషన్‌గా మారింది. ఎలా బయటకొచ్చిందో తెలియదు గానీ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ లుక్‌లో ఎన్టీఆర్ బాగా సన్నబడి స్లిమ్‌గా కనిపిస్తున్నారు. దీంతో నందమూరి వారసుడి లేటెస్ట్ మూవీ RRRలో ఎన్టీఆర్ లుక్ ఎలా ఉండబోతోంది అనే దానిపై ఓ క్లారిటీ వచ్చేసినట్లైంది.

రాజమౌళి RRRలో ఎన్టీఆర్

రాజమౌళి RRRలో ఎన్టీఆర్

స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో సక్సెస్ సాధించిన రాజమౌళి- ఎన్టీఆర్ జోడీ ఆ తర్వాత సింహాద్రి, యమదొంగ సినిమాలతో అలరించారు. మళ్ళీ ఇప్పుడు RRR అనే భారీ ప్రాజెక్టులో భాగమవుతున్నారు. జక్కన్న దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది.

యమదొంగ సమయంలో మార్పు.. మళ్ళీ ఇప్పుడు

యమదొంగ సమయంలో మార్పు.. మళ్ళీ ఇప్పుడు

కెరీర్ పరంగా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఎన్టీఆర్ రెగ్యులర్ లుక్ మార్చేసింది దర్శక ధీరుడు రాజమౌళియే. అప్పట్లో వచ్చిన యమదొంగ సినిమా కోసం లావుగా ఉన్న ఎన్టీఆర్‌ని సన్నగా కావాలని పట్టుబట్టి కొత్త లుక్ లోకి తీసుకొచ్చారు జక్కన్న. ఆ లుక్ ఇప్పటిదాకా కంటిన్యూ అయింది. మళ్ళీ ఇప్పుడు అదే రాజమౌళి ఎన్టీఆర్ లుక్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టారని తెలుస్తోంది.

తాజా లుక్.. నందమూరి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్

తాజా లుక్.. నందమూరి ఫ్యాన్స్ సర్‌ప్రైజ్

తాజాగా బయటకొచ్చిన ఫొటోలో ఎన్టీఆర్ మరింత స్లిమ్‌గా కనిపిస్తున్నారు. ఒకింత ఇది నందమూరి ఫ్యాన్స్‌ని సర్‌ప్రైజ్ చేసింది. ఇక RRRలో కొమురం భీంగా ఎన్టీఆర్ నటిస్తున్నారనే విషయం తెలిసిందే. తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు డిఫెరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడని తెలిసింది. ఈయనతో పాటు అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు.

కియారా అద్వానీ పుట్టిన రోజు.. రామ్ చరణ్ లుక్

కియారా అద్వానీ పుట్టిన రోజు.. రామ్ చరణ్ లుక్

ఇకపోతే మరో హీరో రామ్ చరణ్.. ఇటీవలే కియారా అద్వానీ పుట్టిన రోజు సందర్బంగా కెమెరాకు చిక్కిన సంగతి తెలిసిందే. కోర మీసాలతో డిఫరెంట్‌గా మేకోవర్ అయిన రామ్ చరణ్‌ని చూసి మెగా అభిమానులు మురిసిపోయారు. RRR యూనిట్ నుంచి చెర్రీ అఫీషియల్ లుక్ బయటకు రానప్పటికీ, ఇదే లుక్‌లో రామ్ చరణ్ కనిపిస్తారని ఫిక్స్ అయ్యారంతా.

RRR మూవీ

RRR మూవీ

1920 నాటి పరిస్థితుల నేపథ్యంలో భారీ బడ్జెట్‌తో RRR మూవీ రూపొందుతోంది. రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఆలియా భట్, సముద్రఖని, అజయ్ దేవగణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. డీవీవీ దానయ్య సమర్పణలో హై రేంజ్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జులై 30వ తేదీన విడుదల కానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X