చైతన్య లాగే ఎన్టీఆర్ కూడా రంగంలోకి దిగాడంటే..! ఆశగా చూస్తున్న టీడీపీ సైన్యం

Recommended Video

TDP Cadre Heavy Expectations On Jr NTR || Filmibeat Telugu

ఎన్నికలకు ముందే కాదు.. ఎన్నికలు ముగిశాక కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా సాగుతున్నాయి. భారీ మెజారిటీతో విజయకేతనం ఎగరేసిన వైసీపీ నేతలు టీడీపీ పై ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా వైసీపీ చేస్తున్న ఆరోపణలు టీడీపీ శ్రేణులను కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి అందరి చూపు జూనియర్ ఎన్టీఆర్ పై పడింది. ఎన్టీఆర్ దిగారంటే వైసీపీకి ముచ్చెమటలు పడాతాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎన్టీఆర్ నుంచి టీడీపీ శ్రేణులు కోరుకునేది ఏంటి? ఎన్టీఆర్ పేరు మరోసారి తెరపైకి ఎందుకొచ్చింది? వివరాలు చూస్తే..

టీడీపీ హయాంలో అన్యాయాలు, అక్రమాలు

టీడీపీ హయాంలో అన్యాయాలు, అక్రమాలు

గత ఐదేళ్ల పాలనలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టీడీపీ పార్టీ దోచుకుతిందని ఆరోపిస్తోంది వైసీపీ పార్టీ. టీడీపీ హయాంలో అన్యాయాలు, అక్రమాలు పెద్ద ఎత్తున జరిగాయని అసెంబ్లీ వేదికగా వైసీపీ శ్రేణులు విరుచుకు పడుతున్నాయి. ఈ మేరకు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య వాదోపవాదాలు బలంగా సాగుతూ పలు చర్చలకు దారి తీస్తున్నాయి.

రంగంలోకి తారక రామారావు మనవడు

రంగంలోకి తారక రామారావు మనవడు

ఈ పరిస్థితుల్లో రంగంలోకి దిగారు నందమూరి తారక రామారావు మనవడు చైతన్యకృష్ణ. గత ఎన్నికల్లో టీడీపీ తరఫున యాక్టివ్‌గా పని చేసిన నందమూరి చైతన్యకృష్ణ.. తాజాగా తెలుగు తమ్ముళ్ల మీద దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైసీపీకి వార్నింగ్ ఇచ్చాడు. ఈ మేరకు ఆయన పోస్ట్ చేసిన ఓ వీడియో రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనిపై తెలుగు తమ్ముళ్లు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ కుమారుడే

ఎన్టీఆర్ తనయుడు జయకృష్ణ కుమారుడే

దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కొడుకు జయకృష్ణ కుమారుడే చైతన్యకృష్ణ. గతంలో జగపతి బాబు హీరోగా వచ్చిన ‘ధమ్' చిత్రంలో కీలక పాత్రలో కనిపించాడు చైతన్యకృష్ణ. ఆ సినిమా ఘోర పరాజయం పాలవ్వడంతో సినిమాలకు దూరమైపోయారు. కానీ తాత గారు స్థాపించిన టీడీపీ పార్టీకి మాత్రం తనవంతు సహకారం అందిస్తున్నారు నందమూరి చైతన్యకృష్ణ.

జూనియర్ ఎన్టీఆర్ పై కన్ను

జూనియర్ ఎన్టీఆర్ పై కన్ను

చైతన్యకృష్ణ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ సమయంలో టీడీపీకి మద్దతుగా నిలిచాడంటే సమరోత్సాహం వస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారట. కుదేలైన టీడీపీకి ఈ స్థితిలో జూనియర్ ఎన్టీఆర్ సపోర్ట్ చాలా అవసరమని టీడీపీ శ్రేణుల్లో మరోసారి చర్చలు ఊపందుకున్నాయి. ఈ తరుణంలో చైతన్యకృష్ణ లాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఓ వీడియో రిలీజ్ చేస్తే వైసీపీకి ముచ్చెమటలు పట్టడం ఖాయం అని చెప్పుకుంటున్నారట తెలుగు తమ్ముళ్లు.

సినిమాల్లో ఎన్టీఆర్ బిజీ బిజీ.. టీడీపీ వైపు చూసేనా?

సినిమాల్లో ఎన్టీఆర్ బిజీ బిజీ.. టీడీపీ వైపు చూసేనా?

ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ తన RRR సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తి కాగానే మరో మూడేళ్ళ పాటు ఆయన తన తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉంటారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీడీపీ వైపు ఆయన చూసే ఛాన్సే లేదని అంటున్నారు విశ్లేషకులు. పైగా టీడీపీకి ఎన్టీఆర్ సపోర్ట్ అవసరమని ఎన్ని వార్తలొచ్చినా ఎన్టీఆర్ స్పందించకపోవడం చూస్తుంటే.. ప్రస్తుతం రాజకీయాల పట్ల ఎన్టీఆర్ సుముఖంగా లేరని తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X