మహేష్ బాబు, అల్లు అర్జున్‌లను ఉద్దేశించే ఎన్టీఆర్ ఈ మాట అన్నారా?

నిన్న (జనవరి 8) జరిగిన 'ఎంత మంచివాడవురా!' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఎన్టీఆర్ ఎప్పటిలాగే తన మాటలతో ఆకట్టుకున్నాడు. ఈ మేరకు అన్న కళ్యాణ్ రామ్ 'ఎంత మంచివాడవురా!' మూవీ సక్సెస్ కావాలని కోరుకున్న ఆయన మరో మాట కూడా అన్నారు. సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కానున్న సినిమాలన్నీ బాగా ఆడాలని ఆయన చెప్పారు.

ఇక ఈ సంక్రాంతి సీజన్‌లో ముఖ్యంగా రెండు సినిమాల హవా కనిపిస్తోంది. అందులో ఒకటి మహేష్ బాబు హీరోగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరు' కాగా, మరొకటి అల్లు అర్జున్ హీరోగా రూపొందిన 'అల.. వైకుంఠపురములో'. ఈ రెండు సినిమాలు ఒక్క రోజు గ్యాప్ లోనే వస్తూ ఈ సంక్రాంతికి సందడి వాతావరణం క్రియేట్ చేయబోతున్నాయి.

N. T. Rama Rao Jr. wishes For Mahesh Babu and Allu Arjun

ఈ నేపథ్యంలో ఎంత మంచివాడవురా! ఈవెంట్‌లో ఎన్టీఆర్ అన్న మాటలు చూసి.. ఆయన పరోక్షంగా మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు ఆల్ ది బెస్ట్ చెప్పారని టాక్ నడుస్తోంది. వేదికపై మంచి సినిమాలను ఆదరించే గుణం ప్రేక్షకులకు ఉందన్న ఎన్టీఆర్.. పండగ సందర్భంగా విడుదల కానున్న సినిమాలన్నీ బాగా ఆడాలని కోరుకోవడం మహేష్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్ అభిమానులందరినీ ఆకట్టుకుంది.

ఈ సారి సంక్రాంతి బరిలో నిలుస్తున్న మహేశ్ బాబు, అల్లు అర్జున్ పోటీపడి అప్‌డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేసుకున్నారు. ఇలాంటి తరుణంలో తన అన్న కళ్యాణ్ రామ్ సినిమాతో పాటు, ఇలా ఆ ఇద్దరి సినిమాలు కూడా బాగా ఆడాలని కోరుకోవడం ఎన్టీఆర్ గ్రేట్‌నెస్ అని జనం చెప్పుకుంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X